ETV Bharat / bharat

'ఇద్దరి కోసం మళ్లీ నీట్ నిర్వహించాలని ఆదేశించలేం' - సుప్రీం కోర్టు న్యూస్

ఇద్దరు విద్యార్థుల కోసం నీట్(అండర్​గ్రాడ్యుయేట్) పరీక్ష (NEET 2021) మళ్లీ నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. వారికి పరీక్ష (NEET 2021 exam) నిర్వహించాలంటూ తొలుత బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను కొట్టివేసింది.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Nov 13, 2021, 6:40 AM IST

నీట్‌ ప్రవేశ పరీక్షలో(NEET 2021) ప్రశ్నాపత్రాలు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది.

ఈ ఏడాది సెప్టెంబరు 12న నీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే మహారాష్ట్రలో ఈ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థుల టెస్టు బుక్‌లెట్‌, ఓఎంఆర్‌ షీట్లు ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం కారణంగా పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయి. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష(NEET 2021) నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు వీరికి రీ-ఎగ్జామినేషన్‌కు (NEET 2021 exam) అనుమతినిస్తే మిగతా విద్యార్థులు కూడా చిన్న చిన్న తప్పులకే మళ్లీ పరీక్ష పెట్టమని కోరుతారని కేంద్రం తెలిపింది. అందువల్ల బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ప్రశ్నాపత్రాలు తారుమారవడం వల్ల తాము విలువైన సమయాన్ని కోల్పోయామన్న విద్యార్థుల వాదనను కోర్టు అంగీకరించింది. విద్యార్థులకు ఎదురైన పరిస్థితికి తాము విచారపడుతున్నామని, అయితే వారికి మళ్లీ పరీక్ష(NEET 2021 exam) పెట్టాలని ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించడమనేది కష్టతరమైన ప్రక్రియ అని, అందువల్ల బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు వెల్లడించింది.

ఈ విద్యార్థుల సమస్య పరిష్కారమయ్యేవరకు నీట్ ఫలితాలను (NEET 2021 result) వెల్లడించొద్దని గతంలో బాంబే హైకోర్టు తీర్పునివ్వగా.. ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఇటీవల నీట్‌ ఫలితాలు(NEET 2021) వెల్లడయ్యాయి.

ఇదీ చదవండి:

'లఖింపుర్​' కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం డెడ్​లైన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.