ETV Bharat / bharat

కశ్మీర్​లో వరుస పేలుళ్లు.. ఎనిమిది గంటల్లో రెండు బస్సులు బ్లాస్ట్! - blasts in jammu kashmir

జమ్ము కశ్మీర్​లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆగి ఉన్న బస్సుల్లో పేలుళ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎనిమిది గంటల వ్యవధిలో రెండు బ్లాస్ట్​లు జరిగాయి.

Mysterious blast in bus
Mysterious blast in bus
author img

By

Published : Sep 29, 2022, 9:38 AM IST

జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్‌లో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్సులో పేలుడు సంభవించింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌బంక్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Mysterious blast in bus
బస్సు ధ్వంసం

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఉదంపుర్​లోని మరో బస్సులో పేలుడు సంభవించింది. ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్​లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్​నగర్​కు ఈ బస్సు వెళ్లాల్సి ఉండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇది ప్రమాదం కాదని, పేలుళ్లే అని నిర్ధరించారు పోలీసులు. ఏ రకమైన బాంబులను ఉపయోగించారనే విషయం తెలియాల్సి ఉందని డీఐజీ సులేమాన్ చౌదరి పేర్కొన్నారు. అయితే, వరుస పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి. ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నాయి.

Mysterious blast in bus
ధ్వంసమైన బస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.