చికెన్ వండేందుకు నిరాకరించిన భార్యను హత్య చేశాడు(man kills wife) ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లా సెమారియతోల గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం..
ఆగస్టు 23న నిందితుడు కమలేశ్ కోల్.. భార్య రామ్‌బాయ్ కోల్‌ను చికెన్ వండమని అడిగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నిందితుడు కమలేశ్.. అక్కడే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా మోదాడు(man kills wife). దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
ప్రమాదానికి గురై రామ్‌బాయ్ కోల్ మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. కానీ పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడే సరికి నిందితుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదివారం అరెస్టు చేశారు. చికెన్ వండేందుకు నిరాకరించడం వల్లే భార్యపై దాడి చేసినట్లు నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు.
ఇదీ చూడండి : తేలిన విభజన పంచాయతీ- రాష్ట్ర పక్షిపై కీలక ప్రకటన