ETV Bharat / bharat

ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రేయసి బంధువులు.. కిడ్నాప్ చేశాడని.. - who set mobs house on fire

Mob sets houses on fire: ఓ వర్గానికి చెందిన యువతిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో యువకుడి కుటుంబానికి చెందిన రెండు ఇళ్లకు నిప్పంటించింది ఓ సమూహం. ఈ ఘటన శుక్రవారం ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

Mob sets houses on fire
రెండు ఇళ్లుకు నిప్పంటించిన గుంపు
author img

By

Published : Apr 15, 2022, 10:06 PM IST

Mob sets houses on fire: ఓ వర్గానికి చెందిన యువతిని కిడ్నాప్ చేశాడనే కోపంతో ఆమె ప్రేమించిన యువకుడికి చెందిన రెండు ఇళ్లకు నిప్పంటించారు 'ధరమ్ జాగరణ్ సమన్వయ్ సంఘ్' సభ్యులు. ఈ దాడికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో శుక్రవారం జరిగింది.

ఆగ్రాలోని రునక్తా ప్రాంతంలో జిమ్ యజమాని సాజిద్ ఇంటిని ఓ సమూహం తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. ఈయన ఇంటి పక్కనే ఉన్న ఇంటికి కూడా ఈ గుంపు నిప్పు పెట్టిందని వెల్లడించారు. 22 సంవత్సరాల యువతిని.. సాజిద్ కిడ్నాప్ చేసినందుకు ఆయనను అరెస్టు చేయాలని వీళ్లు డిమాండ్​ చేశారు. స్థానిక రునక్తా మార్కెట్‌లోని దుకాణాలు మూసేసి వ్యాపారులూ వీరికి సంఘీభావం ప్రకటించారు.

11వ తరగతి చదువుతున్న యువతి సోమవారం అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజులు తరువాత ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే తాను మేజర్​నని, ఇష్టపూర్వకంగానే సాజిద్​ వద్దకు వెళ్లినట్టు యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తెలిపింది. ఆ మహిళ తాను మేజర్​ని అని.. సాజిద్​తో ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు తెలిపింది.

సాజిద్​, ఆయనతో వెళ్లిన యువతి ఇద్దరూ మేజర్​లేనని పోలీసులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కోర్టుకు సెలవుల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు.

ఇవీ చదవండి: రేప్​ కేసు వాపస్​ తీసుకోవాలని బెదిరింపులు.. నిప్పంటించుకున్న బాలిక

సర్పంచ్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.