మణిపుర్‌లోని కాంగ్‌పోక్పీ జిల్లా బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతిచెందారు.

బలగాల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు నిర్వహించిన అంత్యక్రియల్లో భారీగా జనం పాల్గొన్నారు. ఈ క్రమంలో వారిపై అనూహ్యంగా 'కుకి' వర్గానికి చెందిన సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.

ఇదీ చూడండి: కశ్మీర్లో ఉగ్రవేటకు 'కార్గో' బృందం సై!