ETV Bharat / bharat

మూడో పెళ్లి గొడవ.. బావను హత్య చేసిన బావమరిది!

Man Killed By Brother in Law: మూడో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి (35) దారుణంగా హత్యకు గురయ్యాడు. బాధితుడిని అతడి బావమరిదే హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.

jharkhand murder
murder
author img

By

Published : Apr 3, 2022, 12:55 PM IST

Man Killed By Brother in Law: ఝార్ఖండ్​లోని తూర్పు సింగ్​భుమ్​ జిల్లాలో దారుణం జరింది. మూడో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో లడూ హైబురు (35) అనే వ్యక్తిని అతని బంధువులే హత్య చేశారు. మార్చి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునపటి భార్య అన్నదమ్ముడే లడూను హత్య చేసి ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

"కొన్ని రోజుల క్రితం మూడోపెళ్లి విషయంపై లడూ హైబురుకి అతడి బావమరిదితో గొడవ జరిగింది. అప్పటి నుంచి లడూ కనిపించడం లేదు. అతడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. లడూ బావమరిదితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశాం. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. లడూ మృతదేహం దుమారియా పోలీసు స్టేషన్​ పరిధిలోని నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలోని ఓ బావిలో లభ్యమైంది. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నాం "

-పోలీసులు

ఇదీ చదవండి: ఆకాశంలో అద్భుతం.. కిందకు పడినవి ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.