ETV Bharat / bharat

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా- 'ఒమిక్రాన్​' అని అనుమానం! - కరోనా కొత్త వేరియంట్

ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్​ వేరియంట్ (Omicron Variant in India)​ భారత్​లో కూడా వ్యాపించిందా? ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహారాష్ట్ర వాసికి కరోనా పాజిటివ్​ రావడం వల్ల వ్యక్తమవుతున్న సందేహాం ఇది. అయితే ఒమిక్రాన్​ సోకిన విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదంటున్నారు అధికారులు.

southafrica variant
కరోనా అలర్ట్​- భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్​!
author img

By

Published : Nov 29, 2021, 9:20 AM IST

Omicron Variant in India: ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్​ వేరియంట్​ ప్రపంచ దేశాలను కలవర పరుస్తోంది. ఈ సమయంలో మహారాష్ట్ర ఠాణే జిల్లా డోంబివలీలో నమోదైన ఓ కరోనా కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. వైరస్​ సోకిన వ్యక్తి ఈనెల 24న దక్షిణాఫ్రికా నుంచి తిరిగి రావడమే అందుకు కారణం. రోగికి ఒమిక్రాన్​ వేరియంట్​ సోకిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే అతనికి సోకింది ఒమిక్రామ్​ వేరియంటా? కాదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత బాధితుడు ఇప్పటివరకు ఎవరినీ కలవలేదని తెలిపారు. ప్రస్తుతం అతను ఆర్ట్​ గ్యాలరీ ఐసొలేషన్​ సెంటర్​లో చికిత్స పొందుతున్నాడని.. ఒకవేళ ఒమిక్రాన్​ సోకినట్లు నిర్ధరణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇదీ చూడండి : వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు.. ఫేస్​ మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.