ETV Bharat / bharat

పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య, రైతులపై హామీల వర్షం- బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్​ - మధ్యప్రదేశ్​ ఎన్నికలు మానిఫెస్టో

Madhya Pradesh BJP Manifesto : అధికారంలోకి రాగానే క్వింటా వరిని 3,100 రూపాయలకు, క్వింటా గోధుములను 2,700 రూపాయలకు కొనుగోలు చేస్తామని మధ్యప్రదేశ్​ ప్రజలకు హామీ ఇచ్చింది అధికార బీజేపీ. పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొంది.

Madhya Pradesh BJP Manifesto
Madhya Pradesh BJP Manifesto
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 3:33 PM IST

Updated : Nov 11, 2023, 7:31 PM IST

Madhya Pradesh BJP Manifesto : మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు అధికార బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే క్వింటా వరిని 3,100 రూపాయలకు, క్వింటా గోధుములను 2,700 రూపాయలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొంది.

పీఎం ఉజ్వల, లాడ్లీ బహ్నా పథకం లబ్ధిదారులకు వంట గ్యాస్‌ను 450 రూపాయలకు ఇస్తామని బీజేపీ తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తామని హామీనిచ్చింది. ఐఐటీ, ఎయిమ్స్‌ తరహాలో మధ్యప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ, మధ్యప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య విద్యాలయాలతో పాటు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. మధ్యప్రదేశ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఈ మ్యానిఫెస్టో రోడ్‌మ్యాప్‌ వంటిదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ అన్నారు. భోపాల్​లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ.. సంకల్ప్​ పత్ర పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

  • #WATCH | Bhopal: BJP chief JP Nadda, CM Shivraj Singh Chouhan, MP BJP chief VD Sharma release manifesto for Madhya Pradesh for the upcoming Assembly election in the state. pic.twitter.com/xEjWysTOMU

    — ANI (@ANI) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజేపీ హామీలు ఇవే..

  • వచ్చే ఐదేళ్లపాటు పేదలందరికీ ఉచిత రేషన్‌.
  • కిసాన్‌ సమ్మాన్‌ నిధి, కిసాన్‌ కల్యాణ్‌ యోజన కింద ప్రతి రైతుకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం.
  • ముఖ్యమంత్రి జన్‌ ఆవాస్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చి, పేద ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం.
  • లాడ్లీ బెహ్నా లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణం.
  • 15 లక్షల మంది మహిళలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ.
  • వీటితోపాటు ఆడపిల్లలకు యుక్తవయస్సు వచ్చే వరకు ఆర్థిక సాయం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కొత్త పథకాల రూపకల్పన చేయనున్నట్లు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.

ఆ ధైర్యం మోదీకే ఉంది!
మరోవైపు, మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో చొరబాటుదారులను అరికట్టగల ధైర్యం బీజేపీ ప్రభుత్వానికే ఉందని తెలిపారు. కాంగ్రెస్​తో పాటు ఇండియా కూటమి పార్టీలకు అది సాధ్యం కాదని ఆరోపించారు. జమ్ముకశ్మీర్​లోని ఆర్టికల్​ 370ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. అది రక్తపాతానికి దారితీస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్​ వ్యాఖ్యలు చేసినప్పటికీ అదేం జరగలేదని అమిత్​ షా చెప్పారు. దేశ సంస్కృతిని కాంగ్రెస్​ ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 2018 ఎన్నికల తర్వాత 15నెలల పాటు అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్​ అనేక సంక్షేమ పథకాలను నిలిపేసిందని ఆరోపించారు.

  • #WATCH | Dhar, Madhya Pradesh: While addressing a public rally in Manawar, Union Home Minister Amit Shah says, "...Vote for the development and future of Madhya Pradesh... In eighteen years, the BJP made the road and electricity reach every village..." pic.twitter.com/pbQQiZabYK

  • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
  • ఫలితాల లెక్కింపు తేదీ: డిసెంబర్ 3

మధ్యప్రదేశ్​ ఎన్నికలకు సంబంధించి ఈటీవీ భారత్​ అందించిన ప్రత్యేక కథనాలు..

Madhya Pradesh Elections Family Battle : మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు.. బావామరదళ్ల మధ్య ఢీ.. పరి'వార్'​లో విజయమెవరిదో?

Madhya Pradesh Scindia Election : 'సింధియా' కింగ్ ఎవరు? గ్వాలియర్‌ బెల్ట్‌లో జ్యోతిరాదిత్య ప్రభావం చూపేనా?

MP CM Constituency Budhni : సొంతగడ్డపై సత్తాచాటేందుకు శివరాజ్​ రెడీ.. VIP నియోజకవర్గంలో విజయం ఎవరిదో?

MP Election Ayodhya Ram Mandir : బీజేపీ X కాంగ్రెస్​.. అయోధ్య రాముడి చుట్టూ మధ్యప్రదేశ్​ ఎన్నికల ప్రచారం!

Ex CMs Relatives In MP Assembly Polls : మధ్యప్రదేశ్​ బరిలో 10 మంది మాజీ సీఎంల బంధువులు.. అదృష్టం వరించేనా?

MP Election Vindhya Region : ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్​.. బీజేపీ-కాంగ్రెస్​ 'ఢీ'.. వింధ్యలో విజయం ఎవరిదో?

Madhya Pradesh Assembly Election 2023 : కమల్​నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్​.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం!

Last Updated : Nov 11, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.