ETV Bharat / bharat

జ్యోతిషుడు చెప్పాడని ప్రియుడ్ని చంపిన కేసులో ట్విస్ట్.. స్టేషన్​లోనే విషం తాగిన నిందితురాలు - కేరళలో యువకుడి హత్య కేసు

కేరళలో తన ప్రియుడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీస్​స్టేషన్​ ఆవరణంలోనే విషం తాగి చనిపోయేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు.

Kerala human sacrifice case
పోలీస్​స్టేషన్​లో విషం తాగిన యువతి
author img

By

Published : Oct 31, 2022, 3:58 PM IST

Updated : Oct 31, 2022, 4:36 PM IST

కేరళలో ప్రేమించిన వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి.. పోలీస్​ స్టేషన్​లోనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న తమిళనాడుకు చెందిన గ్రీష్మ(22) సోమవారం విషం తాగింది. దీన్ని గమనించిన పోలీసులు.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రీష్మ ఆరోగ్యం స్థిరంగానే ఉందని పోలీసులు తెలిపారు.

Kerala human sacrifice case
ప్రియుడు షారన్​తో​ కలిసి ఉన్న నిందితురాలు
Kerala human sacrifice case
సెల్ఫీలో మృతుడు షారన్​తో నిందితురాలు గ్రీష్మ

అసలు ఏం జరిగిందంటే.. తిరువనంతపురంలోని పరశాలలో నివసించే షారన్​ అక్టోబర్​ 25న మృతి చెందాడు. అయితే షారన్​ మృతి పట్ల అనుమానంతో అతని కుటుంబ సభ్యులు.. తమిళనాడులోని రామవర్మంచిరలోని అతని ప్రేయసి గ్రీష్మపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆదివారం 8 గంటల పాటు గ్రీష్మను విచారించగా విస్తుపోయే నిజాల్ని వెల్లడించింది. వివాహం జరిగితే మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది. తాను గతంలో ఎవరికీ తెలియకుండా ఓ చర్చిలో షారన్​ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది.

Kerala human sacrifice case
షారన్​కు విషం కలిపిన జ్యూస్​​ ఇస్తున్న గ్రీష్మ

గ్రీష్మకు మరో యువకుడితో ఫిబ్రవరిలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. అయితే.. మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పినందుకే షారన్​ను హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అక్టోబర్​​ 14వ తేదీన తమిళనాడులోని రామవర్మంచిర్​లో ఉన్న గ్రీష్మా ఇంటికి వెళ్లి ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. అయితే అక్కడ వారు జ్యూస్​ తాగే పోటీని పెట్టుకున్నారు. గ్రీష్మ.. షారన్​కు జ్యూస్​లో కాపర్ సల్ఫేట్​ కలిపి ఇచ్చింది. అది తాగిన అతడు​ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందుతూ షారన్​ మృతి చెందాడు. విషం తాగిన కారణంగానే షారన్​ మృతి చెందినట్లు శవపరీక్ష​లో తేలింది. ఈ విషయాన్ని రుజువు చేసేలా గ్రీష్మ, షారన్​ మధ్య వాట్సాప్ చాటింగ్‌లు లభించాయి. అమ్మాయితో బయటకు వెళ్లిన ప్రతీసారి షారన్‌కు కడుపునొప్పి వచ్చేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వారిద్దరూ కలిసిన ప్రతీ సారి షారన్​కు విషం కలిపిన జ్యూస్​ ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

Last Updated : Oct 31, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.