Vijay vasanth pen: పెన్ను పోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ. అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకమని తెలిపారు.
కాంగ్రెస్‌కు చెందిన కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ తన రూ.లక్షా యాభైవేల పెన్ను పోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. చెన్నైలో జరిగిన.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సమావేశంలో తన పెన్ను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఈ పెన్నును తన తండ్రి ఇచ్చారని.. అది తనకు ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. అలాంటి పెన్ను పోవడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! ఒకే రోజులో రెండు..17 రోజుల్లో ఏడు