ప్రస్తుత రోజుల్లో అన్నం వండేందుకు ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్(rice cooker) వాడటం సర్వసాధారణమైంది. బియ్యం, నీటిని తగిన మోతాదులో వేసి కుక్కర్ ఆన్ చేస్తే.. అన్నం తయారవుతుంది. కానీ, మన ప్రమేయం లేకుండానే, ఆటోమేటిక్‌గా బియ్యం, నీటిని తీసుకుని అన్నం వండే కుక్కర్‌ను ఎప్పుడైనా చూశారా? కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ సరికొత్త రైస్ కుక్కర్‌ను తయారు చేశారు.
ఈ కుక్కర్ ఆటోమేటిక్‌గా అన్నం వండటమే(automatic rice cooker) కాదు.. మన సూచనల మేరకు బియ్యం నుంచి పిండిపదార్థాన్ని(గంజి) వేరు చేస్తుంది. ఇది మధుమేహ రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా(best rice cooker for diabetics) ఉంటుంది. అన్నంలో గంజి ఉండాలా? లేదా? అని నిర్ణయించే విధంగా ఈ కుక్కర్‌ను తయారు చేశారు.
ఫోన్ ద్వారా కమాండ్స్..
జీఎస్ఎమ్, ఐఓటీ ఆధారిత సాంకేతికత ద్వారా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్‌గా పని చేసే విధంగా రూపొందించారు. రైస్ కుక్కర్లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేయటం వల్ల మొబైల్ ఫోన్ ద్వారా కమాండ్స్ అందుకుని 1-12 ఏళ్ల వయసుగల పిల్లల కోసమూ ఆహారం తయారు చేస్తుంది.
అయితే, ఈ రైస్ కుక్కర్లో మరో రెండు ఛాంబర్లు ఉంటాయి. వాటి ద్వారా ఆటోమేటిక్‌గా నీరు, బియ్యాన్ని కుక్కర్లో వేసేలా రూపొందించారు. అలాగే, ఎంతమందికి వండాలి, ఎంత రైస్ తీసుకోవాలి అనే సూచనలనూ ఈ కుక్కర్ పాటిస్తుంది. ఆహారం ఉడికిన తర్వాత.. ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది.
ప్రోత్సాహం అవసరం..
ఈ కుక్కర్‌ను(best rice cooker for diabetics) పెద్ద సంఖ్యలో తయారు చేసేందుకు అనుమతుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు విద్యార్థులు. ఇందులోని అన్ని భాగాలను కలిపి, సరికొత్త, ఆటోమేటిక్ కుక్కర్‌ను తయారు చేసేందుకు కొన్ని నెలల సమయం పట్టినట్లు చెప్పారు. డాక్టర్ బిలాల్ అహ్మద్ మాలిక్ పర్యవేక్షణలో సాజిద్ నూర్, జహాంగిర్ హమీద్, ఇమ్రాన్ నజిర్, అజ్రా హుస్సేన్, అరిజ్ కౌల్లు ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
కశ్మీర్ లోయలోని యువతలో పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల ట్రెండ్ పెరుగుతోందని తెలిపారు డాక్టర్ బిలాల్ అహ్మద్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోత్సాహం అవసరమని తెలిపారు. ఇలాంటి తక్కువ ధర కుక్కర్ మార్కెట్లోకి వస్తే సాధారణ ప్రజలతో పాటు మధుమేహ రోగులకు ఉపయోగపడుతుందన్నారు.
ఇదీ చూడండి: ఓ చిన్న సంభాషణ.. సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం