ETV Bharat / bharat

పెంపుడు జంతువులకూ ఆన్​లైన్​లోనే రైలు టికెట్లు.. మెడికల్​ సర్టిఫికెట్​ కంపల్సరీ! - Online Railway Tickets For Pets Latest

రైళ్లల్లో మనతో పాటు తీసుకెళ్లే పెంపుడు జంతువుల కోసం క్యూలో నిలబడి బుక్​ చేసే సంప్రదాయ టిక్కెట్​ బుకింగ్​ పద్ధతికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. వీటికోసం ప్రత్యేకంగా ఆన్​లైన్​ బుకింగ్​ వ్యవస్థలో మార్పులు చేయాలని నిర్ణయించింది.

Online Railway Tickets For Pets Latest News
కుక్కలు, పిల్లుల కోసం ఆన్​లైన్​లో టిక్కెట్లు.. రంగం సిద్ధం చేస్తోన్న రైల్వే శాఖ!
author img

By

Published : May 7, 2023, 4:23 PM IST

ఇకపై రైలు ప్రయాణాల్లో తమతోపాటు పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు! ఈ మేరకు టీటీఈలు పెంపుడు జంతువులకు టికెట్‌ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్‌క్లాస్‌ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించేవారు. అయితే ఏసీలో కాకుండా వేరే బోగీలో పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదా? స్టేషన్​కు ఎన్ని గంటల ముందుకు చేరుకోవాలి? రైలు క్యాన్సిల్​ అయితే ఏంటి పరిస్థితి?

పెంపుడు జంతువులను మనతోపాటు తీసుకెళ్లొచ్చా?
నిర్మొహమాటంగా.. మనం పెంచుకునే కుక్కలు, పిల్లులు, పందులు, కుందేళ్లు వంటి పెంపుడు జంతువులను మనం ప్రయాణించే రైలులో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. వీటి కోసం రైల్వే బోర్డు నిర్దేశించిన కొంత రుసుమును చెల్లించి ప్రత్యేకంగా టిక్కెట్​ కొనాల్సి ఉంటుంది. కాకపోతే ఈ టిక్కెట్లను పొందాలంటే ప్రత్యేకించి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. అధికారులు తేనున్న ఈ నూతన వ్యవస్థ కారణంగా ఈ సంప్రదాయ పద్ధతికి ముగింపు పలికే ఆస్కారం ఉంది. దీంతో చాలామందికి ఊరట లభించనుంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలలాగే పెంపుడు జంతువులకు కూడా ఆన్‌లైన్ టిక్కెట్ ​బుకింగ్ సౌకర్యం అంశాన్ని పరిశీలించాలని రైల్వేకి సంబంధించి ప్రత్యేక కేంద్రాన్ని కోరింది రైల్వే మంత్రిత్వ శాఖ. అక్కడి నుంచి పచ్చజెండా వస్తే గనుక మీతో(ప్రయాణికులు) పాటే IRCTC వెబ్‌సైట్‌లో మీ పెంపుడు జంతువులకు సైతం టిక్కెట్లు సులభంగా బుక్​ చేసుకోవచ్చు.

AC-1తో పాటు SLRలో కూడా..
ఇదివరకు యజమానులు తమ పెంపుడు జంతువులను కేవలం AC ఫస్ట్​ క్లాస్​ కోచుల్లో మాత్రమే తీసుకెళ్లేందుకు వీలుండేది. రైల్వే బోర్డు తాజా ప్రతిపాదనలో ముఖ్యంగా ట్రైన్​ గార్డ్స్​ కోసం కేటాయించే SLR కోచ్​లలో కూడా పెంపుడు జంతువులు ప్రయాణించేలా మార్పులను పొందుపర్చారు. రైలు హాల్ట్‌ల వద్ద యజమానులు జంతువులకు ఆహార పదార్థాలు, నీరు అందించవచ్చు. అయితే AC-2 టైర్, AC-3 టైర్, AC- ఛైర్ కార్, స్లీపర్ క్లాస్ లేదా సెకండ్​ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో మాత్రం పెంపుడు జంతువులను తీసుకెళ్లడం నిషిద్ధం.

మూడు గంటల ముందే స్టేషన్​కు..
ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను.. రైలు బయలుదేరే మూడు గంటల ముందు లగేజీ కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు సమాచారం అందించాలి. తాము పెంచుకునే జంతువులను AC ఫస్ట్ క్లాస్‌లో తీసుకెళ్లాలనుకుంటే గనుక వాటిని ప్యాక్​ చేసే బ్యాగేజీ కోసం ప్రయాణికుడు అదనంగా కొంత మొత్తాన్ని రైల్వే శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

మెడికల్​ సర్టిఫికెట్​ తప్పనిసరి..
ప్రయాణికుడు తప్పనిసరిగా పశు వైద్యుడి నుంచి రైలులో ప్రయాణించే పెంపుడు జంతువుకు సంబంధించి రంగుతో పాటు దాని లింగ నిర్ధారణను ధ్రువీకరించే పత్రాన్ని కలిగి ఉండాలి.

మీ డబ్బులే మాత్రమే తిరిగి వస్తాయి!
ఇదిలా ఉంటే పెంపుడు జంతువుల కోసం ఆన్​లైన్​లో టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి.. అవేంటంటే.. జంతువు బుకింగ్​కు సంబంధించి కచ్చితమైన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పలు కారణాలతో టిక్కెట్​ బుకింగ్​ను రద్దు చేస్తే మాత్రం సొమ్ము తిరిగి రాదు. ​అనివార్యంగా ఏవైనా రైళ్లు రద్దు లేదా మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యం అయినట్లయితే.. పెంపుడు జంతువు కోసం బుక్​ చేసిన టిక్కెట్ డబ్బులు తిరిగి రావు. కేవలం ప్రయాణికుడి రుసుమును మాత్రమే రీఫండ్​ చేస్తారు.

పూర్తి అధికారాలు TTEకే..
మరోవైపు టిక్కెట్​ బుకింగ్​ సాఫ్ట్​వేర్​లో చేపట్టే ఈ మార్పులు ప్రత్యేకించి పెంపుడు జంతువుల కోసం కేటాయించే ఆన్​లైన్​ టికెట్​ బుకింగ్​ స్లాట్​ల విషయంలో పూర్తి అధికారాలను TTE (ట్రైన్​ టికెట్​ ఎగ్జామినర్​)లకే అప్పగించాలని ప్రతిపాదనలో రైల్వే శాఖ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.