ETV Bharat / bharat

భారత్​ నుంచి 4 దేశాలకు 33 లక్షల కరోనా టీకాలు!

వ్యాక్సిన్​ మైత్రిలో(Vaccine Maitri) భాగంగా.. విదేశాలకు కొవిడ్​ టీకా డోసులను ఎగుమతిని భారత్ తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మయన్మార్​, నేపాల్, బంగ్లాదేశ్​కు 10 లక్షలు చొప్పున కొవిషీల్డ్​ టీకాలు అందించగా.. ఇరాన్​కు మూడు లక్షల కొవాగ్జిన్​ డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.

Vaccine Maitri
వ్యాక్సిన్​ మైత్రి
author img

By

Published : Oct 10, 2021, 2:29 PM IST

భారత్​ మరోసారి తన ఉదారత చాటుకుంది. కొవిడ్​తో కొట్టిమిట్టాడుతున్న దేశాలకు గతంలో కోట్లాది టీకా డోసులను ఎగుమతి(India vaccine export) చేసిన భారత్.. తాజాగా మరిన్ని డోసులను పొరుగు దేశాలైన మయన్మార్​, నేపాల్​, బంగ్లాదేశ్​ సహా ఇరాన్​కు అందించినట్లు సమాచారం. మయన్మార్​, నేపాల్, బంగ్లాదేశ్​లకు 10 లక్షలు చొప్పున కొవిషీల్డ్​ టీకా డోసులు అందించగా.. ఇరాన్​కు మూడు లక్షల కొవాగ్జిన్​ డోసులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి(vaccine maitri) అండగా నిలిచింది భారత్​. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు(vaccine maitri) అందించి, సాయపడుతోంది.

భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్​ టీకాలను 'వ్యాక్సిన్​ మైత్రి'(vaccine maitri) కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని గతనెల 20న ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా తెలిపారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.

ఇదీ చూడండి: డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డికి ఆర్యభట్ట పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.