India Corona cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 3,962 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే 26 మంది చనిపోయారు. శుక్రవారం 2,697 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.89 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.
- దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,72,547
- మొత్తం మరణాలు: 5,24,677
- యాక్టివ్ కేసులు: 22,416
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,25,454
Vaccination India: దేశవ్యాప్తంగా శుక్రవారం 11,67,037 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,96,47,071కు చేరింది. మరో 4,45,814 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లోనూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కొత్తగా 521,382 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,161 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 534,631,089 కు చేరింది. మరణాల సంఖ్య 6,318,912కు చేరింది. ఒక్కరోజే 498,855 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 505,389,919గా ఉంది.
- అమెరికాలో శుక్రవారం 1,03,221 కొత్త కేసులు, 316 మరణాలు నమోదయ్యాయి.
- ఉత్తర కొరియాలో మళ్లీ రికార్డు స్థాయిలో 80 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి.
- తైవాన్‌లో శుక్రవారం 76,564 మంది మహమ్మారి బారినపడ్డారు. 142 మంది మరణించారు
- జర్మనీలో మరో 41,287 మంది కొవిడ్ బారినపడ్డారు. ఒక్కరోజు 81 మంది చనిపోయారు.
- బ్రెజిల్లో మరో 36,189, ఆస్ట్రేలియాలో 32,118 మందికి వైరస్‌కు సోకింది.
ఇవీ చదవండి: 'దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే కొత్త చట్టం'
మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన.. 'షికాగో' రేడియో స్పీకర్స్!