ETV Bharat / bharat

సైనిక చర్చల్లో భారత్​- చైనా కీలక నిర్ణయం! - india china border dispute map

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనపై(India China border dispute) చైనా సైన్యంతో చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ (WMCC India China) తెలిపింది. 14వ విడత సీనియర్ కమాండర్ల భేటీ (India China Commander level meeting) త్వరగానే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేయి దాటిపోకుండా చూడాలని ఇరువర్గాలు అంగీకారానికి వచ్చినట్లు వివరించింది.

india china border talks
india china border talks
author img

By

Published : Nov 18, 2021, 6:19 PM IST

తూర్పు లద్దాఖ్​లో చైనా సైన్యంతో నెలకొన్న ప్రతిష్టంభనపై ఆ దేశ సైనిక ప్రతినిధులతో లోతైన చర్చలు (WMCC India China) జరిపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సమస్యలకు (India China border talks) సత్వర పరిష్కారం కనుగొనాలని ఇరువర్గాలు అంగీకరించుకున్నట్లు వెల్లడించింది. తర్వాతి దఫా చర్చలు (India China Commander talks) త్వరగానే జరపాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

ఇరువర్గాలు సరిహద్దులో క్షేత్రస్థాయి పరిస్థితులను (India China border dispute) చేయిదాటిపోకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు సరిహద్దు సమస్యపై ఏర్పాటైన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో (WMCC meeting) చర్చలు జరిపినట్లు పేర్కొంది.

"14వ విడత సీనియర్ కమాండర్ల చర్చలు (India China Commander level meeting) త్వరగా నిర్వహించుకోవాలని ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో సంయమనం పాటించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి."

-విదేశాంగ శాఖ

సెప్టెంబర్​లో భారత్-చైనా విదేశాంగ మంత్రులు చేసుకున్న అవగాహన ఒప్పందాలు సమావేశంలో చర్చకు వచ్చాయని ప్రకటనలో విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దీని ప్రకారం ఇరువర్గాలు చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: సరిహద్దులో సైనికుల పోరాటం భేష్.. సీపీసీ కితాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.