ఉత్తర్ప్రదేశ్ మైన్పురి జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. మూడు తలలతో జన్మించింది ఓ నవజాత శిశువు. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది.
గులారియపుర్కు చెందిన రాగిని అనే మహిళ సోమవారం ఈ చిన్నారికి జన్మనిచ్చింది. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని రాగిని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే మూడు తలలతో శిశువు జన్మించే సరికి వైద్యులతో పాటు వారు కూడా విస్మయం చెందారు.
దైవాంశ..
ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ చేశారు. కాగా, మూడు తలలతో బిడ్డ జన్మించిందని తెలుసుకున్న వారంతా తనను చూసేందుకు తరలివస్తున్నారు. కొంత మందైతే అది దేవుని అవతారమని కూడా అంటున్నారు.
ఇదీ చూడండి: అమానవీయం: నవజాత శిశువు శవాన్ని అలా..