ETV Bharat / bharat

దారుణం.. బాలికపై 33 మంది సామూహిక అత్యాచారం

దేశంలో మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఠాణెలో ఓ మైనర్​పై 33 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

rape
సామూహిక అత్యాచారం
author img

By

Published : Sep 23, 2021, 2:38 PM IST

Updated : Sep 23, 2021, 3:42 PM IST

మహారాష్ట్ర ఠాణెలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దోంబివల్లిలోని భోపర్​ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై 33 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 23 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మరో 10మంది పరారీలో ఉన్నారు.

ఇదీ జరిగింది...

15 ఏళ్ల మైనర్​.. మంపాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముంటోంది. ఆమెకు ఓ యువకుడితో సంబంధం ఉంది. ఓ సందర్భంలో మైనర్​ను ఆ యువకుడు అసభ్యకరంగా వీడియోలు తీశాడు. ఈ ఘటన జనవరి 22న జరిగింది. అనంతరం బ్లాక్​మెయిల్​కు పాల్పడ్డాడు. వీడియోలను అడ్డుపెట్టుకుని అప్పటి నుంచి 33 మంది.. దోబివల్లి, బద్లాపుర్​, ముర్బాద్​, రాబెల్​ ప్రాంతాల్లో చిత్రహింసలు పెట్టి తొమ్మిది నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు.

మంపాడ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్లు పెరుగుతున్నాయి.

పెరిగిపోతున్న అత్యాచారాలు...

వీధుల్లో యాచించుకుని బతికే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కిరాతుకుడు. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ్​లో జరిగింది. కాగా.. ఛత్తీస్​గఢ్​లో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి.. ముగ్గురు కిరాతుకులు సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. కాగా ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

మరో ఘటనలో అర్ధరాత్రి క్యాబ్ ఎక్కిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తనపై ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆంధ్రప్రదేశ్​కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కదులుతున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో(Uttar Pradesh Rape) ఈ నెల 21న జరిగింది. బస్సు కండక్టర్​, అతని సహాయకుడే ఈ దారుణానికి ఒడిగట్టారని బాలిక తల్లి వాపోయింది. మరోవైపు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

ఇవీ చూడండి:-

తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్​రేప్​

వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం

Last Updated : Sep 23, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.