ETV Bharat / bharat

ఆ రాశుల వారికి అదృష్టయోగం - ధన లాభం గ్యారెంటీ! - Horoscope Today

Horoscope Today January 16th 2024 : జనవరి 16న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 16 January 2024
Horoscope Today January 16th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 5:02 AM IST

Horoscope Today January 16th 2024 : జనవరి 16న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అనుకూలంగా ఉంటుంది. పూర్తి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. బంధు, మిత్రులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. స్నేహితులను, ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభాలను అందిస్తాయి. విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం ఫర్వాలేదు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. పెళ్లికాని యువతీ, యువకుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. పిల్లల గురించి మంచి శుభ వార్త వింటారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అదృష్టయోగం ఉంది. ఓ స్త్రీ మూలంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. తీర్థయాత్రలకు ఉపక్రమిస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ధ్యానం చేయాలి. ఆధ్యాత్మిక చింతనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఆహ్లాదంగా గడుపుతారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు. సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీరు ప్రారంభించిన పనులు అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడకూడదు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. విద్యార్థులు మాత్రం కష్టపడి పనిచేస్తే కచ్చితంగా రాణిస్తారు. షేర్​ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుదిరితే ప్రయాణాలు మానుకోవడం మంచిది.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. శాంతం వహించడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాల పట్ల ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగులకు ఇవాళ చాలా బాగుంటుంది. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందిపడతారు. అనవసరపు వ్యయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరగవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలి. మీ లక్ష్యం చేరుకోవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇవి కచ్చితంగా విజయవంతం అవుతాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు బాగా ఖర్చు చేస్తారు. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.