ETV Bharat / bharat

2013లో తప్పిపోయిన మహిళ.. ఇన్నేళ్లకు భర్త చెంతకు.. ఎలా దొరికిందంటే? - దిల్లీ నుంచి వచ్చి భార్యను కలిసిన భర్త

మతిస్తిమితం కోల్పోయి తొమ్మిదేళ్ల క్రితం ఇంటికి దూరమైంది ఆ మహిళ. ఇన్నాళ్లకు తన భర్త చెంతకు చేరింది. తొమ్మిదేళ్ల తర్వాత భార్యను చూసేసరికి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆమె భర్త. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

man reunited with wife
man reunited with wife
author img

By

Published : Jan 4, 2023, 1:53 PM IST

భార్యను కలుసుకున్న వ్యక్తి

తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన తన భార్యను ఎట్టకేలకు కలుసుకున్నాడు ఓ వ్యక్తి. తన భార్యను చూసి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. కర్ణాటక కొడగు జిల్లాలోని మడికెరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే..
హరియాణాకు చెందిన కేహర్ సింగ్(55).. అతడి భార్య దర్శిని(50) దిల్లీలో నివాసం ఉండేవారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. దర్శినికి మానసిక సమస్యలు ఉండేవి. 2013లో దర్శిని దిల్లీ నుంచి తప్పిపోయింది. తన భార్య కోసం కేహర్ అన్ని చోట్లా వెతికాడు. అయినా.. ఎక్కడా ఆమె జాడ లభించలేదు. అయినప్పటికీ.. కొన్ని ఏళ్ల పాటు ఆమె కోసం కేహార్ కుటుంబం వెతుకుతూనే ఉంది. దేశంలో కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ తదనంతర పరిణామాల అనంతరం ఈ ప్రయత్నాలను విరమించారు కేహర్. కరోనా వల్ల ఆమె చనిపోయి ఉంటుందని అంతా భావించారు.

man reunited with wife
భార్యతో కేహర్

అయితే, ఒకరోజు కేహర్ సింగ్​కు ఫోన్ వచ్చింది. దర్శిని బతికే ఉందని ఓ వ్యక్తి ఫోన్​లో చెప్పాడు. కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఆమె కనిపించిందని తెలిపాడు. వెంటనే కేహర్ కర్ణాటకకు బయల్దేరాడు. సుమారు రెండున్నర వేల కిలో మీటర్ల దూరాన్ని లెక్క చేయకుండా వెంటనే కొడగు ప్రాంతానికి ప్రయాణం ప్రారంభించాడు. కొడగుకు చేరుకున్న కేహర్.. తన భార్యను చూసి చలించిపోయాడు. ఆమెను చూడగానే వెళ్లి గుండెలకు హత్తుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత దర్శినిని చూసేసరికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకరినొకరు మిఠాయిలు తనిపించుకొని ఆనందం పంచుకున్నారు.

man reunited with wife
భార్యతో కేహర్
man reunited with wife
దర్శినికి లడ్డూ తినిపిస్తున్న కేహర్

ఎలా దొరికిందంటే..
నాలుగేళ్ల క్రితం దర్శిని కర్ణాటకలోని కుషల్​నగర్​లో పోలీసులకు కనిపించింది. ఒంటిపై సరిగా దుస్తులు లేని ఆమెను.. మడికెరిలోని తానల్ షెల్టర్ హోమ్​కు తరలించారు. తానల్ ఇన్​స్టిట్యూట్​ను నడిపిస్తున్న మహ్మద్ అనే వ్యక్తి.. దర్శిని బాగోగులు చూసుకున్నాడు. నాలుగేళ్లుగా ఇక్కడే ఆమెకు మానసిక చికిత్స అందించారు.

ఇటీవల దర్శిని తన స్వస్థలం గురించి సంస్థ సిబ్బందికి చెప్పింది. తన పేరు దర్శిని అని.. ఊరు హరియాణా అని తెలిపింది. వెంటనే మహమ్మద్.. పోలీసులను సంప్రదించాడు. హరియాణా పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేసేలా చూశాడు. దీంతో, మిస్సింగ్ లిస్ట్​లో దర్శిని పేరు ఎక్కడైనా ఉందేమోనని తనిఖీ చేసిన హరియాణా పోలీసులకు.. కేహర్ గురించి తెలిసింది. వెంటనే అతడికి సమాచారం చేరవేశారు.

man reunited with wife
అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్న కేహర్

'మేం నిరాశ్రయులైన మహిళలకు మా షెల్టర్ హోమ్​లో ఆశ్రయం ఇస్తున్నాం. 2018 జులైలో మా షెల్టర్ హోమ్​లో దర్శినిని చేర్పించారు. నాలుగేళ్లు ఆమెకు చికిత్స అందించాం. గతంలో హరియాణా పేరుతో పాటు కొన్ని పట్టణాల పేర్లు చెప్పేది. పోలీసులను సంప్రదించి ఈమె కుటుంబ సభ్యుల వివరాలు ఆరా తీస్తే.. దిల్లీ నుంచి కేహర్ సింగ్ వచ్చారు. గతంలోనూ చాలా మందిని తమ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాం. వారు ఆనందంగా ఇంటికి వెళ్తుంటే మాక్కూడా సంతోషంగా అనిపిస్తుంది' అని షెల్టర్ హోమ్​ను నడిపిస్తున్న మహమ్మద్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.