ETV Bharat / bharat

ఆస్తి కోసం క్రూరత్వం- బామ్మను కుక్కతో కరిపించిన మనవడు - ఆస్తి కోసం బామ్మపై కిరాతకం

ఆస్తిపై దురాశతో 70 ఏళ్ల బామ్మతో క్రూరంగా ప్రవర్తించాడు ఓ మనవడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు కుక్కతో కరిపించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దిక్కుతోచని స్థితిలో దిల్లీ మహిళా కమిషన్​ను(డీసీడబ్ల్యూ) ఆశ్రయించింది.

Grandson attack on Grandmother
Grandson attack on Grandmother
author img

By

Published : Jan 24, 2022, 9:22 PM IST

ఆస్తిపై దురాశతో బామ్మపై దౌర్జన్యానికి దిగాడు ఓ కిరాతక మనవడు. కుక్కతో కరిపించి తీవ్రంగా గాయపరిచాడు. ఈ హృదయవిదారక ఘటన దిల్లీలో వెలుగుచూసింది.

అసలేమైందంటే..?

70ఏళ్ల వృద్ధురాలు దిల్లీలోని తూర్పు వినోద్​ నగర్​ ప్రాంతంలో తన మవవడితో నివాసముంటుంది. బామ్మ ఆస్తిపై కన్నేసిన మనవడు.. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ బామ్మను హింసించడం మొదలుపెట్టాడు. ఆరు నెలల క్రితం ఓ కుక్కను ఇంటి తీసుకొచ్చాడు. ఆ శునకాన్ని చూసి భయపడిన బామ్మ.. దాన్ని బయట వదిలేయమని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోని మనవడు.. ఆ కుక్కను ఇంట్లోనే ఉంచాడు. దానితోనే బామ్మను బెదిరించేవాడు. చిత్ర హింసలకు గురిచేసేవాడు. చివరకు ఆమెపై కుక్కను ఉసిగొల్పి.. కరిపించాడు. దీంతో విసుగుపోయిన బాధితురాలు జనవరి 13న దిల్లీ మహిళా కమిషన్​ను(డీసీడబ్ల్యూ) ఆశ్రయించింది. హెల్ప్​లైన్​ నంబరుకు ఫోన్​ చేసి విషయాన్ని వివరించింది.

జనవరి 20న బాధితురాలిని కలిసిన డీసీడబ్ల్యూ​ బృందం.. వృద్ధురాలి ఒంటిపై గాయాలను చూసి విస్తుపోయింది. ఆమెకు అండగా నిలిచింది. కళ్యాణ్​పురి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్​ 289 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీసీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ స్వాతి మలివాల్.. వృద్ధురాలి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేస్తూ.. నోటీసులు జారీ చేశారు. బాధిత మహిళ భద్రత, కేసులో తీసుకుంటున్న చర్యలపై సవివరమైన నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది మహిళా కమిషన్.​

ఇదీ చూడండి: కదిలే రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.