ETV Bharat / bharat

గోవర్ధన పూజ ఎప్పుడు- 13నా? 14వ తేదీనా? శుభ ముహూర్తం, పూజా విధానం!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 11:30 AM IST

Govardhan Puja 2023 Date: హిందూ పురాణాల ప్రకారం.. గోవర్ధన పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ ఏడాది గోవర్ధన పూజ తేదీ ఎప్పుడు?, శుభ ముహుర్తం, పూజా విధానం.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Govardhan_Puja_2023_Date_and_Shubh_Muhurat

Govardhan Puja 2023 Date and Shubh Muhurat in Telugu: శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని పైకెత్తి బృందావన వాసులను రక్షించే లీలను కొనియాడుతూ చేసుకునేది గోవర్ధన మహోత్సవం లేదా గోవర్ధన పూజ. సనాతన ధర్మంలో గోవర్ధన పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గోమాతను, గోవర్ధన పర్వతాలతో పాటుగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మరి ఈ ఏడాది గోవర్ధన పూజ ఎప్పుడు..? శుభ ముహుర్తం..? పూజా విధానం ఏంటి..? వంటివి ఇప్పుడు చూద్దాం..

గోవర్ధన పూజ: ప్రతి సంవత్సరం దీపావళి మరునాడు గోవర్ధన్ పూజను జరుపుకుంటారు. దీనిని అనేక ప్రాంతాల్లో అన్న కూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండగ ప్రకృతికి, మానవులకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక.

గోవర్ధన్ పూజ ఎప్పుడు: ఈ సంవత్సరం గోవర్ధన పూజ విషయంలో గందరగోళం నెలకొంది. నవంబర్ 13 లేదా నవంబర్ 14 ఈ రెండు తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో చాలా సందిగ్ధత నెలకొంది. వేర్వేరు రోజుల్లో శుభ ముహూర్తాలు రావడంతో ఈ సమస్య తలెత్తుతోంది. గోవర్ధన పూజ తిథి.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమయ్యి.. నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2:36 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ తిథి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం గోవర్ధన పూజను నవంబర్ 14వ తేదీన జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

భక్తులకు అలర్ట్​ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

గోవర్ధన పూజ శుభ సమయం: గోవర్ధన పూజ శుభ సమయం ఉదయం 6:43 నిమిషాల నుంచి 8:52 నిమిషాల వరకు ఉంటుంది. శుభ సమయం మొత్తం వ్యవధి రెండు గంటల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. పూజా కార్యక్రమాలు చేయాలనుకునేవారు ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదమని వారు చెబుతున్నారు.

గోవర్ధన పూజా విధానం:

  • గోవర్ధన పూజను చేయాలనుకునేవారు ఉదయాన్నే బ్రహ్మ గడియల్లో నిద్ర లేవల్సి ఉంటుంది.
  • తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని.. ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి.
  • ఆ తర్వాత ఇంట్లో ఉండే పూజ గదిని శుభ్రం చేసుకుని పూజను ప్రారంభించాల్సి ఉంటుంది.
  • గోవర్ధన పూజ ప్రారంభించడానికి ముందు.. ఆవు పేడతో గోవర్ధన పర్వతం ఆకారాన్ని, అలాగే ఆవుని కూడా తయారు చేయాలి.
  • గోవర్ధన పర్వతాన్ని తయారు చేసిన తర్వాత.. దాని దగ్గర నూనె దీపం వెలిగించండి.
  • తర్వాత పూలు, పసుపు, బియ్యం, చందనం, కుంకుమను సమర్పించండి.
  • పూజ గదిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి అభిషేకాలు చేసి పువ్వులతో అలంకరించాలి.
  • పాల పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్ధాలను కన్నయ్య, గోవర్ధన పర్వతానికి సమర్పించిన తర్వాత.. స్వామి వారికి నమస్కరించి.. గోవర్ధన పూజకు సంబంధించిన కథను చదవండి.
  • ఇవన్నీ సమర్పించిన తర్వాత గోవర్ధన పర్వతానికి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయండి.
  • ఆ తరువాత శ్రీకృష్ణుని ధ్యానిస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఉపవాసాలు ప్రారంభించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.