ETV Bharat / bharat

ప్రియుడ్ని కలిసేందుకు ఊరికి కరెంట్ ఆపేస్తున్న యువతి.. చీకట్లో అడ్డంగా దొరికిపోయి.. - లవర్​ కోసం కరెంట్​ కట్​చేసిన యువతి

బాయ్​ఫ్రెండ్​ను కలవడానికి ట్రాన్స్​ఫార్మర్​ వద్ద కరెంట్​ తీసేస్తూ రెడ్​హ్యాండెడ్​గా దొరికింది ఓ యువతి. దీంతో ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు గ్రామస్థులు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Girlfriend Power Cut To Meet Boyfriend
Girlfriend Power Cut To Meet Boyfriend
author img

By

Published : Jul 18, 2023, 7:42 AM IST

Girlfriend Power Cut To Meet Boyfriend : ప్రేమికుడిని రహస్యంగా కలుసుకోడానికి ఓ ప్రియురాలు వింత పని చేసింది. ప్రతి రోజు రాత్రి ట్రాన్స్​ఫార్మర్​ వద్దకు వెళ్లి విద్యుత్​ సరఫరాను నిలిపివేసేది. అనంతరం ప్రియుడితో ప్రేమలో మునిగిపోయేది. అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆరా తీసి.. ప్రేమికులను ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం యువకుడికి దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘటన బిహార్​లోని బేతియా జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే?
బేతియా జిల్లా నౌతన్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో యువతి నివసిస్తోంది. ఆమె అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే, పగలు ప్రియుడిని కలిస్తే ఎవరైనా చూస్తారని.. రాత్రి సమయంలో కలుద్దామని నిర్ణయించుకుంది. ఆ ప్లాన్​ను ప్రియుడికి చెప్పి.. ఆ సమయంలో వారిని ఎవరూ చూడకుండా ఉండేందుకు ఓ ఉపాయం ఆలోచించింది. ప్రతి రోజు ప్రియుడిని కలుసుకునే సమయానికి ట్రాన్స్​ఫార్మర్​ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేసేది. అనంతరం వారిద్దరు ఏకాంతంగా గడిపేవారు.

Girlfriend Power Cut To Meet Boyfriend
గ్రామస్థులకు పట్టుబడ్డ ప్రేమజంట

అయితే, ప్రతి రోజు కరెంట్ ఎందుకు పోతుందో గ్రామస్థులకు అర్థం కాలేదు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఓ యువతి ఇలా చేస్తోందని తెలిసింది. ఆ తర్వాత వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో గ్రామస్థులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి చేశారు. యువతిని నిలదీశారు. ఈ ఘటనను ఓ స్థానికుడు వీడియో తీయగా.. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.

ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన పోలీసులు ప్రేమ జంటను పోలీస్ స్టేషన్​కు రప్పించి.. వారి తల్లిదండ్రులను పిలిపించారు. ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చారు. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోవడం వల్ల వివాదం సద్దుమణిగింది. దీంతో యువతీయువకులను పోలీసులు విడిచిపెట్టారు. అయితే, ఆ యువతి వల్ల గ్రామం పరువుపోతోందని.. ఆమె కరెంట్​ తీయడం వల్ల ఊళ్లో దొంగతనాలు జరుగుతున్నాయని ఓ గ్రామస్థుడు ఆరోపించాడు. ఇప్పటివరకు రెండు బైక్​లు, కరెంట్​ మోటార్లు, చాలా వరకు మేకలు చోరీకి గురయ్యాయని తెలిపాడు.

పెళ్లి మండపం నుంచి వరుడు పరార్​.. 20కి.మీ వెంబడించిన వధువు..
మే నెలలో ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. పెళ్లి పీటల వరకు వచ్చిన వివాహాన్ని వద్దంటూ మండపం నుంచే పారిపోయాడు ఓ వరుడు. ఇది తెలుసుకున్న ఆ వధువు అతడిని 20 కిలోమీటర్ల మేర బస్సులో వెంబడించి మరీ పట్టుకుంది. మరి చివరకు వీరి పెళ్లి జరిగిందో.. లేదో.. తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేసి పూర్తి కథనం చదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.