ETV Bharat / bharat

వరుడు కావాలని యాడ్ ఇచ్చిన యువతి.. అబ్బాయి అలా ఉంటేనే పెళ్లి..! - girl marriage advertisement

Girl marriage Add: వరుడు కావాలని పత్రికా ప్రకటన ఇచ్చింది ఓ యువతి. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో పూస గుచ్చినట్లు చెప్పింది. ఆసక్తిగలవారు సంప్రదించేందుకు రెండు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే..?

girl-got-advertisement-printed-for-her-marriage-in-hazaribag
వరుడు కావాలని యాడ్ ఇచ్చిన యువతి
author img

By

Published : Jun 11, 2022, 6:01 PM IST

Girl Advertisement for Groom: పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే ఝార్ఖండ్​ హజారీబాగ్​కు చెందిన ఓ యువతి మాత్రం తన సంబంధం తానే చూసుకుంటోంది. వరుడు కావాలని పత్రికా ప్రకటన ఇచ్చింది. ఓ పెళ్లి వేడుకలో గోడపై దీన్ని అతికించింది. తనకు ఎలాంటి వాడు కావాలో పూస గుచ్చినట్లు ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదించేందుకు రెండు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది.

girl-got-advertisement-printed-for-her-marriage-in-hazaribag
వరుడు కావాలని అమ్మాయి ఇచ్చిన ప్రకటన

ఈ యువతి హజారీబాగ్ ఝండా చౌక్ సమీపంలోని బంగాలీ దుర్గాలో నివాసముంటోంది. పత్రికా ప్రకటనలో చెప్పిన వివరాలు ప్రకారం ఆమెకు ఎలాంటి వాడు కావాలంటే..
అబ్బాయి మంచి వాడు అయి ఉండాలంట. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలంట. వయసు 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. నిజాయితీగా ఉండాలి. అబద్దాలు చెప్పకూడదు. పిసినారితనం ఉండకూడదు. ఏ కులానికి చెందినవాడైనా అభ్యంతరం లేదు. మరీ హైపర్ యాక్టివ్​గా ఉండనక్కర్లేదు. కాస్త యాక్టివ్​గా ఉంటే చాలు. తనకంటే చిన్నవాడైనా సరే ఆసక్తి ఉంటే ఓకే. ఈ నిబంధనలు వర్తించేవారు సంప్రదించేందుకు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది యువతి. ఈ ప్రకటన చూసిన వాళ్లంతా ఔరా అనుకుంటున్నారు. పెళ్లి కావాలని ఓ యువతి ప్రకటన ఇవ్వడమేంటమని ఆశ్చర్యపోతున్నారు. ఈ గోడ పత్రికను ఫొటోను తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. స్థానికంగా ఈ విషయమే చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: భార్య కోసం.. జైలులో 50 రోజులుగా నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.