ETV Bharat / bharat

అక్కాచెల్లెళ్లపై బంధువుల సామూహిక అత్యాచారం - సామూహిక అత్యాచార వార్తలు

Gangrape Latest News: మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేశారు. మరోవైపు ఛత్తీస్​గఢ్​లో ఓ 16 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Gangrape Latest News
అత్యాచారం
author img

By

Published : Dec 13, 2021, 11:21 PM IST

Gangrape Latest News: మహారాష్ట్రలోని లాతుర్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడారు. వీరిలో కొందరు బాలికల బంధువులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన ఈనెల 5న వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం..

లాతుర్​ జిల్లాలోని మేనమానల ఇంట్లో కొంత కాలంగా అక్కాచెల్లెళ్లు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో ఒకరికి వివాహం కూడా అయింది. కానీ బాధితురాళ్లు వారి వేధింపులు భరించలేక ఈ ఏడాది జులైలో ఇంటి నుంచి పరారై పుణెకు చేరుకున్నారు. నిరాశ్రయులైన బాలికలను స్థానికులు ఓ చిల్డ్రన్స్​ హోమ్​లో చేర్చించారు. అయితే.. వీరిద్దరూ ఈనెల 5న స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.

మేనమామల ఇంట్లో ఉన్నంతకాలం తాము అత్యాచారానికి గురయ్యారని బాలికలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 10 మంది నిందితులను అరెస్ట్​ చేశారు. వీరిలో బాలికల మేనమాలు, వివాహితైన బాలిక భర్త ఉండడం గమనార్హం.

ఛత్తీస్​గఢ్​లోనూ..

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​ జిల్లాలో ఓ 16 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం డిసెంబరు 9న జరిగిన ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితులను జావేద్​ అక్తర్ (24), రెహ్మాన్ అలీ (21)గా గుర్తించారు. సదరు బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : ట్రిప్​ పేరుతో బాలికపై స్కూల్​ టీచర్ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.