ETV Bharat / bharat

నీటి మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి - మహాారాష్ట్ర నీట మనిగి

బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది.

five-members-of-the-same-family-drowned-in-a-mine-at-dombivali

author img

By

Published : May 8, 2022, 6:30 AM IST

Five Drowned Dead: మహరాష్ట్రలో విషాదం జరిగింది. ఇద్దరు మహిళలు తమ పిల్లలను వెంట తీసుకుని బట్టలు ఉతకడానికి గ్రామంలో చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం వల్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబివాలి సమీప గ్రామాల్లో గత కొన్ని రోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలో సందప్​ గ్రామానికి చెందిన గైక్వాడ్​ కుటుంబంలో ఇద్దరు మహిళలు తమ పిల్లలను తీసుకుని బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదుపు తప్పి ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మరణించిన వారిని మీరా గైక్వాడ్​(55), ఆమె కోడలు ఆపేక్ష(30), మయూరేశ్​(15), మోక్ష(13), నీలేశ్​గా (15) పోలీసులు గుర్తించారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక శాస్త్రినగర్​ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'జై భీమ్​' తరహా ఘటన.. లాకప్​​ డెత్​ కేసులో పోలీసులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.