ETV Bharat / bharat

Farmer Kills Tiger : ఆవును తినేసిన పులి.. పగతో రగిలిపోయిన రైతు.. విషం పెట్టి క్రూర మృగం హత్య! - తమిళనాడులో పులి హత్య

Farmer Kills Tiger : తన ఆవుపై పులి దాడిచేసి చంపేసిందని ఓ వ్యక్తి ప్రతీకారంతో రగిలిపోయాడు. తన గోవును చంపిన పులిపై కక్ష పెంచుకున్నాడు. దాన్ని ఎలాగైనా చంపేయాని పథకం వేశాడు. పులి చంపిన తన ఆవు కళేబరానికే.. పురుగుల మందు పూశాడు. ఆ కళేబరాన్ని తిన్న రెండు పులులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. పులుల మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

tigers-died-after-eating-poisoned-cow-carcass-in-mudumalai-tiger-reserve-forest-tamilnadu
ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులులు మృతి
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 12:38 PM IST

Updated : Sep 12, 2023, 2:23 PM IST

Farmer Kills Tiger : తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రెండు పులుల అనుమానాస్పదమృతి ఘటనలో.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. ఎమరాల్డ్‌లోని నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు గుర్తించి.. దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు పులుల కళేబరాలకు సమీపంలోనే ఓ ఆవు కళేబరం లభ్యమైంది. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పులులు, ఆవు కళేబరాల నుంచి నమూనాలను సేకరించి కోయంబత్తూరుకు పంపారు అధికారులు. కళేబరాలలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడం వల్లే పులులు చనిపోయినట్టు ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది.

ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. తానే ఆవు కళేబరాన్ని విషపూరితం చేసినట్టు శేఖర్‌ అంగీకరించాడు. పది రోజుల కిందట తప్పిపోయిన తన ఆవును వెతకడానికి సమీపంలోని అడవికి వెళ్లానని, ఓ చోట ఆవు మృతదేహం కనిపించిందని, దానిని పులి చంపినట్లు గ్రహించానని తెలిపాడు. తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీసుకోవాలని భావించి.. పురుగుమందులతో దాని మృతదేహాన్ని విషపూరితం చేసినట్టు వివరించాడు.

చనిపోయినవాటిలో ఒక పులి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోగా.. మరొకటి గాయపడినట్లు అధికారులు తెలిపారు. విషపూరిత ఆవు కళేబరాన్ని తిని కనీసం రెండు పులులలో ఒకటి మరణించి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో పులి ఎలా చనిపోయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే, విషపూరిత కళేబరాన్ని తినడానికి ముందు మూడేళ్ల వయసున్న పులిని ఎనిమిదేళ్ల వయసున్న పులి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. గాయాలున్న పులి మరణానికి కచ్చితమైన కారణాలు ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ తర్వాత వెల్లడవుతుందని అన్నారు.

రాయల్​ బంగాల్​ టైగర్​ను చంపిన అటవీ సిబ్బంది.. ఎందుకంటే?..
కొద్ది రోజుల క్రితం అసోంలోని కజీరంగా జాతీయ పార్క్​లో ఓ రాయల్​ బెంగాల్​ టైగర్​ మృత్యువాత పడింది. ప్రమాదవశాత్తు గార్డు తుపాకీ నుంచి వచ్చిన తూటా పులికి తగలడం వల్ల.. అది అక్కడికక్కడే మరణించింది. ఇందుకుగానూ అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీరియల్ షూటింగ్​లో మళ్లీ చిరుత కలకలం.. పది రోజుల్లో నాలుగోసారి!

గాండ్రిస్తూ దూసుకొచ్చిన పెద్దపులి.. భయంతో వణికిపోయిన టూరిస్ట్​లు.. చివరకు ఏమైంది?

Last Updated : Sep 12, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.