ETV Bharat / bharat

గేమింగ్ యాప్​ పేరుతో బడా ఫ్రాడ్​.. ఈడీ సోదాలతో గుట్టు రట్టు.. రూ.17 కోట్లు స్వాధీనం - గేమింగ్ యాప్ కేసులో ఈడీ సోదాలు

'మోసపూరిత' మొబైల్ గేమింగ్​ యాప్​ ప్రమోటర్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కీలక పురోగతి సాధించింది. కోల్​కతాలో సోదాలు జరిపి ఏకంగా రూ.17 కోట్లు నగదు స్వాధీనం చేసుకుంది.

e nuggets app fraud case
గేమింగ్ యాప్​ ఫ్రాడ్​పై ఈడీ నజర్.. రూ.7కోట్లు నగదు స్వాధీనం
author img

By

Published : Sep 10, 2022, 3:08 PM IST

Updated : Sep 10, 2022, 9:15 PM IST

మోసపూరిత మొబైల్​ గేమింగ్ యాప్​కు సంబంధించిన కేసులో ఏకంగా రూ.17కోట్లు నగదు స్వాధీనం చేసుకుంది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్. కోల్​కతాలో ఆ యాప్​ ప్రమోటర్​కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో శనివారం సోదాలు జరిపి, ఈ నగదును గుర్తించింది.
"ఈ-నగ్గెట్స్​ అనే గేమింగ్ యాప్, దాని ప్రమోటర్​ ఆమిర్​ ఖాన్​కు సంబంధించి కోల్​కతాలో దాదాపు 6 చోట్ల సోదాలు జరిపాం. రూ.17కోట్లు నగదు పట్టుబడింది. డబ్బు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది" అని ప్రకటనలో తెలిపింది ఈడీ.

మోసం ఇలా..
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ-నగ్గెట్స్ యాప్​ ప్రారంభించిన కొత్తలో యూజర్లకు కమీషన్లు ఇచ్చారు. వ్యాలెట్​లోని బ్యాలెన్స్​ను సులువుగా విత్​డ్రా చేసుకునే వీలు కల్పించారు. ఫలితంగా యూజర్లలో యాప్​పై నమ్మకం పెరిగింది. ఎక్కువ కమీషన్​కు ఆశపడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. అలా భారీ మొత్తంలో నిధులు సమీకరించాక.. యాప్​ నుంచి యూజర్లు కమీషన్​ విత్​డ్రా చేసుకునే ప్రక్రియను ఈ-నగ్గెట్స్ యాజమాన్యం నిలిపివేసింది. సిస్టమ్ అప్డేట్ చేస్తున్నామని, దర్యాప్తు సంస్థలు విచారణను ఎదుర్కొంటున్నామని సాకులు చెప్పింది. చివరకు యూజర్ల డేటా సహా సర్వర్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసింది. అప్పుడే ఈ యాప్ చేసిన మోసం జనాలకు అర్థమైంది.

ఈ-నగ్గెట్స్​ యాప్​ సహా ఆ కంపెనీ ప్రమోటర్​పై 2021 ఫిబ్రవరిలో కోల్​కతా పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. ఆ కేసు ఆధారంగా మనీలాండరింగ్​ కోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవల అందిన సమాచారం ఆధారంగా శనివారం విస్తృత సోదాలు చేపట్టి, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది.
ఆన్​లైన్​లో సులువుగా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధించి.. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణమైన చైనీస్ లోన్ యాప్స్​కు, ఈ-నగ్గెట్స్​ మొబైల్ గేమింగ్ యాప్​కు సంబంధం ఉందా అనే కోణంలోనూ ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.

Last Updated : Sep 10, 2022, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.