Earthquake In Delhi : దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాదిలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4 గా నమోదైంది. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్కు 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 6 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని సమాచారం. మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో డోడ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం అధికారులు వెల్లడించారు. దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. శ్రీనగర్‌లో స్కూల్లోని పిల్లలు, దుకాణాల్లో ప్రజలు భయంతో బయటకు పరిగెత్తారని స్థానికులు తెలిపారు. డోడా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సీలింగ్ కూలిపోయింది. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
-
#WATCH | An earthquake of magnitude 5.4 on the Richter scale hit Doda, J&K at 1:33 pm this afternoon.
— ANI (@ANI) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A local from Srinagar says, "The earthquake scared school children. People in shops rushed out. It was scary. This was more intense than the tremors last week..." pic.twitter.com/c08L07mz6i
">#WATCH | An earthquake of magnitude 5.4 on the Richter scale hit Doda, J&K at 1:33 pm this afternoon.
— ANI (@ANI) June 13, 2023
A local from Srinagar says, "The earthquake scared school children. People in shops rushed out. It was scary. This was more intense than the tremors last week..." pic.twitter.com/c08L07mz6i#WATCH | An earthquake of magnitude 5.4 on the Richter scale hit Doda, J&K at 1:33 pm this afternoon.
— ANI (@ANI) June 13, 2023
A local from Srinagar says, "The earthquake scared school children. People in shops rushed out. It was scary. This was more intense than the tremors last week..." pic.twitter.com/c08L07mz6i
-
VIDEO | The ceiling of a government hospital collapsed in Bhaderwah town after a 5.4 magnitude earthquake hit J&K's Doda district earlier today. pic.twitter.com/nr6wULkb4d
— Press Trust of India (@PTI_News) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | The ceiling of a government hospital collapsed in Bhaderwah town after a 5.4 magnitude earthquake hit J&K's Doda district earlier today. pic.twitter.com/nr6wULkb4d
— Press Trust of India (@PTI_News) June 13, 2023VIDEO | The ceiling of a government hospital collapsed in Bhaderwah town after a 5.4 magnitude earthquake hit J&K's Doda district earlier today. pic.twitter.com/nr6wULkb4d
— Press Trust of India (@PTI_News) June 13, 2023
-
Earthquake of Magnitude:5.4, Occurred on 13-06-2023, 13:33:42 IST, Lat: 33.15 & Long: 75.82, Depth: 6 Km ,Location: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/OyJTMLYeSm@ndmaindia @Dr_Mishra1966 @Indiametdept @KirenRijiju pic.twitter.com/6Ezq3dbyNE
— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Earthquake of Magnitude:5.4, Occurred on 13-06-2023, 13:33:42 IST, Lat: 33.15 & Long: 75.82, Depth: 6 Km ,Location: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/OyJTMLYeSm@ndmaindia @Dr_Mishra1966 @Indiametdept @KirenRijiju pic.twitter.com/6Ezq3dbyNE
— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2023Earthquake of Magnitude:5.4, Occurred on 13-06-2023, 13:33:42 IST, Lat: 33.15 & Long: 75.82, Depth: 6 Km ,Location: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/OyJTMLYeSm@ndmaindia @Dr_Mishra1966 @Indiametdept @KirenRijiju pic.twitter.com/6Ezq3dbyNE
— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2023
పాక్‌లో ఇళ్ల నుంచి బయటకు పరుగులు
Earthquake In Pakistan : భారత్‌తోపాటు అటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూమి కంపించినట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ చెప్పింది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఇది సంభవించిందని.. తూర్పు కశ్మీర్‌లో 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌లో భూకంప తీవ్రత కనిపించింది. భూకంప ప్రభావంతో ఇస్లామాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది.
పాకిస్థాన్‌లో స్వల్ప భూ ప్రకంపనలు తరచుగా సంభవిస్తుంటాయి. 2005లో సంభవించిన భారీ భూకంపం దాటికి మాత్రం 74వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
-
5.7 Magnitude earthquake felt in Kashmir, Hindustan and Pakistan. pic.twitter.com/6PwuUNfcIH
— Muhammad Ibrahim Qazi (@miqazi) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">5.7 Magnitude earthquake felt in Kashmir, Hindustan and Pakistan. pic.twitter.com/6PwuUNfcIH
— Muhammad Ibrahim Qazi (@miqazi) June 13, 20235.7 Magnitude earthquake felt in Kashmir, Hindustan and Pakistan. pic.twitter.com/6PwuUNfcIH
— Muhammad Ibrahim Qazi (@miqazi) June 13, 2023
మార్చిలో రెండు సార్లు భూప్రకంపనలు
అంతకుముందు ఈ ఏడాది మార్చిలో దేశ రాజధాని దిల్లీలో రెండు సార్లు భూకంపం సంభవించింది. ఒకే రోజు వ్యవధిలో రిక్టర్ స్కేల్‌పై 2.7 తీవ్రత, 6.8 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. దిల్లీతో పాటు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలోని 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఈ భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, లాహోర్ సహా ఇతర నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో పాకిస్థాన్‌లో 9 మంది చనిపోగా.. 120 మందికి పైగా గాయాల పాలయ్యారు. భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ భూకంపం కారణంగా భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. దిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూప్రకంపనలను సంభవించాయి. దీని ధాటికి ఆయా రాష్ట్రాల ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభవానికి జమ్ములో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.