ETV Bharat / bharat

లిక్కర్​ స్మగ్లింగ్​లో శునకం అరెస్ట్​.. 11 రోజులుగా జైలులో.. పోలీసులకు ముప్పతిప్పలు!

మద్యం అక్రమ రవాణా కేసులో ఓ జర్మన్​ షెపర్డ్​ శునకాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 రోజులుగా శునకం పోలీసుల రిమాండ్​లో ఉంది. అదేంటి కుక్క స్మగ్లింగ్​ చేయడమేంటి అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందంటే?

doggy-locked-in-police-station-in-case-of-liquor-smuggling-in-buxar bihar

author img

By

Published : Jul 17, 2022, 8:16 PM IST

బిహార్​లో.. లిక్కర్​ స్మగ్లింగ్​ కేసులో ఓ జర్మన్ షెపర్డ్​ కుక్క 11 రోజులుగా పోలీసుల రిమాండ్​లో ఉంది. ఆ రాష్ట్ర సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా​ పోలీసులు.. ఓ కారులో విదేశీ మద్యం సీసాలను తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఆ కారులో జర్మన్​ షెపర్డ్​ కుక్క ఉండడం వల్ల దానిని కూడా అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

doggy-locked-in-police-station-in-case-of-liquor-smuggling-in-buxar bihar
బక్సర్​ పోలీస్​స్టేషన్​లో జర్మన్ షెపర్డ్

వివరాల్లోకి వెళ్తే..
జులై 6న బక్సర్​ జిల్లాలోని ఘాజీపుర్​ సరిహద్దు వద్ద రామ్​సురేశ్​ యాదవ్​, భునేశ్వర్​ యాదవ్ అనే ఇద్దరు స్మగ్లర్లు​ విదేశీ మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్న సమయంలో బక్సర్​ పోలీసులకు పట్టుబడ్డారు. అదే సమయంలో వారితో పాటు ఆ కారులో జర్మన్​ షెపర్డ్​ కుక్క కూడా ఉంది. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్​ చేసిన పోలీసులు స్టేషన్​కు తరలించారు. కారుతో పాటు మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కుక్కను కూడా స్టేషన్​కు తీసుకెళ్లారు.

ముప్పతిప్పలు పెడుతున్న శునకం.. ఏం ఆలోచించి పోలీసులు కుక్కను అదుపులోకి తీసుకున్నారోగాని.. ఇప్పుడు మాత్రం ఆ శునకమే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ జర్మన్ షెపర్డ్ కుక్క రోజువారీ ఖర్చులు చాలా ఎక్కువ. ప్రతిరోజు ఆహారాన్ని సంతృప్తిగా పెట్టాలి. లేకపోతే ఒకటే రచ్చరచ్చ. దీంతో ఏం చేయాలో తెలియక స్టేషన్​ సిబ్బంది తలో కొంత డబ్బులు చందాలు వేసుకుని.. ఆహారం పెడుతున్నారు. రోజువారీ ఫుడ్​లో కొంచెం తగ్గినా.. శునకం గట్టిగా మొరిగి అందరి నిద్రను పాడుచేస్తుంది. దీంతో ఆ కుక్క యజమాని కోసం ఎదురుచూస్తున్నారు పోలీసులు. వచ్చి శునకాన్ని తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. అప్పటి వరకు దానిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే మరి. ప్రస్తుతం ఆ కుక్కను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

ఐదేళ్లు అయినా.. బిహార్​లో సంపూర్ణ నిషేధ చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయింది. దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ గృహ హింస కేసులను అరికట్టే లక్ష్యంతో సీఎం నితీశ్​ కుమార్​ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ గత ఐదేళ్లలో ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో చోట.. అక్రమంగా తరలిస్తున్న మద్యం లభ్యమవుతోంది. రాత్రి సమయాల్లో స్మగ్లర్లు మద్యాన్ని అక్రమంగా తరలించి విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: చెస్​ ఒలింపియాడ్​ స్పెషల్​.. ఈ 'చదరంగం' వంతెనను చూశారా?

నదిలో 53కేజీల వెండి శివలింగం.. గ్రామస్థుల పూజలు.. పోలీస్ స్టేషన్​లో దర్శనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.