ETV Bharat / bharat

ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న దంతం.. రెండు గంటల ఆపరేషన్​ తర్వాత.. - అరుదైన ఊపిరితిత్తుల శస్త్రచికిత్స

ఊపిరితిత్తుల్లో దంతం ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నఓ వ్యక్తికి ఆపరేషన్ చేశారు వైద్యులు. రెండు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను​ పూర్తి చేశారు.

doctors-remove-implanted-tooth-stuck-in-mans-lung-through-rare-surgery-in-gujarath
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న కృత్రిమ పన్ను
author img

By

Published : Mar 2, 2023, 10:47 PM IST

గుజరాత్​ వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఊపిరితిత్తుల్లో దంతం ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి.. విజయవంతంగా ఆపరేషన్​ నిర్వహించి ఉపశమనం కల్పించారు. ఈ ఆపరేషన్​కు రెండు గంటల సమయం పట్టింది. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన 52 వ్యక్తికి ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఈ ఘటన సూరత్​లో జరిగింది.

"ఛాతీ నొప్పితో నా దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అనంతరం నేను అతడికి ఎక్స్​రే తీశాను. ఊపిరితిత్తుల్లో దంతం ఉండటాన్ని గమనించాను. బ్రాంకోస్కోపీని ఉపయోగించి ఆ వ్యక్తికి ఆపరేషన్​ చేశాం. అందుకు రోగి కుటుంబ సభ్యులు అనుమతి సైతం తీసుకున్నాం. ఆఖరికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తైంది" అని శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ గామి తెలిపారు.

"కొద్ది రోజుల క్రితం నేను కట్టించుకున్న దంతం(కృత్రిమ పన్ను) ఊడిపోయింది. దాన్ని నేను అనుకోకుండా మింగేశాను. మలం గుండా అదే బయటకు వస్తుందని భావించాను. కానీ అది జరగలేదు. కొద్ది రోజుల తరువాత నాకు ఛాతీలో నొప్పి మొదలైంది. క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. దీంతో వైద్యుడిని సంప్రదించాను. వైద్యుడు గామి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు."

--రోగి

బిహార్​లోనూ ఇదే తరహా ఘటన..
కొద్ది రోజుల క్రితం కూడా బిహార్ ఇలాంటి ఘటనే జరిగింది. గుండెకు సమీపంలో ఓ వ్యక్తి కృత్రిమ దంతం ఇరుక్కుపోయింది. తీవ్రంగా కష్టపడ్డ వైద్యులు.. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి దాన్ని బయటకు తీశారు. ఆహారం తింటుండగా దంతాన్ని ఆ వ్యక్తి మింగేశాడు. అది గొంతు లోపలికి వెళ్లి గుండెకు, ఊపిరితిత్తులకు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కఠినమైన సర్జరీ చేసి బాధితుడిని కాపాడారు వైద్యులు. పట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు.

ఇదీ జరిగింది..
బెగుసరాయ్​కు చెందిన సురేంద్ర కుమార్(45).. గతంలో పై దవడకు కృత్రిమ దంతం పెట్టించుకున్నారు. ఆహారం తింటుండగా.. అనుకోకుండా ఆ దంతం ఊడిపోయింది. దాన్ని కొక్కెంతో సహా మింగేశాడు సురేంద్ర. దీంతో విపరీతమైన నొప్పి తలెత్తింది. వెంటనే బెగుసరాయ్​లోని ఓ ప్రైవేటు క్లినిక్​లో చికిత్స చేయించుకున్నారు. ఎండోస్కోపీ నిర్వహించి దంతాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు అక్కడి వైద్యులు. కానీ అది సాధ్యపడలేదు. పట్నాకు వెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని పరాస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.