ETV Bharat / bharat

ఓవర్ డోస్ ఇంజెక్షన్ చేసుకుని డాక్టర్ సూసైడ్​.. పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్య.. - తమిళనాడు ఈరోడ్ న్యూస్

ఓ వైద్యుడు తనకు తానే అధిక మోతాదు ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు.. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదని మనస్తాపానికి గురయ్యాడు ఓ యువకుడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థతి తీవ్రంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘోరం కర్ణాటకలో వెలుగుచూసింది.

doctor commits suicide
వైద్యుడు ఆత్మహత్య
author img

By

Published : Dec 31, 2022, 4:13 PM IST

Updated : Dec 31, 2022, 11:05 PM IST

ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు తనకు తానే అధిక డోస్​ మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్​లో జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వైద్యుడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ జరిగింది..
సంపత్ నగర్​లోని న్యూటీచర్స్ కాలనీలో శక్తివేల్, పూర్ణిమ దంపతులు తమ పదేళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. శక్తివేల్.. ఈరోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యూరాలజిస్ట్​గా పనిచేస్తున్నాడు. అతడి భార్య ఉన్నత చదువుల నిమిత్తం అహ్మదాబాద్​లో ఉంటోంది. ఈ క్రమంలో డిసెంబర్ 30న శక్తివేల్ ఇంటి నుంచి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు అతడి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే శక్తివేల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడి చేతికి మత్తు ఇంజెక్షన్ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన శక్తివేల్​ను ఈరోడ్​లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శక్తివేల్ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు.. శక్తివేల్​ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఈరోడ్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో శక్తివేల్‌ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్‌ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

doctor commit suicide in injection
ఆత్మహత్య చేసుకున్న శక్తివేల్

పెళ్లి కావట్లేదని సూసైడ్​..
కర్ణాటక ధార్వాడ్​లో దారుణం జరిగింది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కుదరట్లేదని సంతోష్ కోరడి అనే యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. శ్మశానవాటికలో యువకుడు ఆత్మహత్యకు యత్నించగా.. స్థానికులు గమనించి అతడిని రక్షించారు. హుటాహుటిన హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Last Updated : Dec 31, 2022, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.