airport smuggling news: దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ నగదును సీఐఎస్ఎఫ్, నిఘా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌కు వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద సుమారు రూ.40 లక్షల విలువగల విదేశీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రూ.2లక్షల సౌదీ రియల్స్, 200 అమెరికా డాలర్స్, 170 దిర్హమ్స్ను నోట్‌బుక్స్ మధ్యలో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. నిందితుడిని 31 ఏళ్ల మహ్మద్ హరున్గా గుర్తించారు.
![airport smuggling news:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15432410_cash.jpg)
![airport smuggling news:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15432410_cashh.jpg)
"నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండడం వల్ల అనుమానం వచ్చి అతడి లగేజీని తనిఖీ చేశాం. దాంతో నాలుగు నోట్‌బుక్స్ అట్టల మధ్యలో పెట్టిన నగదును గుర్తించాం. పట్టుబడిన నగదుకు సంబంధించి అతడు సరైన పత్రాలు చూపించలేదు."
-సీఐఎస్ఎఫ్ అధికారులు
ఇదీ చదవండి: 'కశ్మీరీ పండిట్' టీచర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు