ETV Bharat / bharat

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేసిన ఈడీ - దిల్లీ మద్యం కుంభకోణం కేసు సీబీఐ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసిన తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌పై తీహాడ్‌ జైళ్లో ఉన్న సిసోదియాను.. ప్రత్యేక కోర్టు అనుమతితో ఈడీ అధికారులు మార్చి 7 నుంచి మూడు రోజులు ప్రశ్నించారు. గురువారం ప్రశ్నించడం పూర్తైన తర్వాత ఈడీ అధికారులు సిసోదియాను అరెస్ట్ చేశారు.

ED arrests Manish Sisodia
ED arrests Manish Sisodia
author img

By

Published : Mar 9, 2023, 7:12 PM IST

Updated : Mar 9, 2023, 7:29 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా అరెస్ట్ చేసింది. ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసిన తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌పై తీహాడ్‌ జైళ్లో ఉన్న సిసోదియాను.. ప్రత్యేక కోర్టు అనుమతితో ఈడీ అధికారులు మార్చి 7 నుంచి మూడు రోజులు ప్రశ్నించారు. గురువారం ప్రశ్నించడం పూర్తైన తర్వాత ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించారు.

మనీశ్‌ సిసోదియాను ఈడీ అరెస్టు చేయడంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ స్పందించారు. "మనీశ్‌ను తొలుత సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడా వారికి డబ్బు దొరకలేదు. శుక్రవారం మనీశ్ బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఉంది. ఆయన రేపు విడుదలయ్యేవారు. అందువల్ల ఈరోజే సిసోదియాను ఈడీ అరెస్టు చేసింది. వాళ్ల లక్ష్యమంతా ఒక్కటే.. ఎట్టి పరిస్థితుల్లో మనీశ్‌ను లోపలే ఉంచడం. రోజుకో కొత్త నకిలీ కేసును సృష్టిస్తుండటం ప్రజలు చూస్తున్నారు. సమాధానం చెబుతారు" అని ట్వీట్‌ చేశారు.

శుక్రవారమే బెయిల్​ పిటిషన్​ విచారణ.. ఈలోపల..
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌ కోసం సిసోదియా తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌దారుడికి ట్రయల్‌ కోర్టు, దిల్లీ హైకోర్టుల నుంచి రక్షణ పొందే వీలుండగా నేరుగా సుప్రీంకోర్టుకు రావడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆయన బెయిల్‌ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ.. రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 4న దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరగాల్సిన తరుణంలో మరో దర్యాప్తు సంస్థ ఆయన్ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

లిక్కర్ స్కామ్ కేసులో సిసోదియాను సీబీఐ ఫిబ్రవరి చివర్లో అరెస్టు చేసింది. రెండు దఫాలుగా సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మార్చి 20 వరకు ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే, తీహాడ్ జైలులో ఆయన ఏకాంతంగానే ఉన్నారని జైలులోని పోలీసు వర్గాలు తెలిపాయి. సిసోదియాతో ఎవరూ గదిని పంచుకోవడం లేదని స్పష్టం చేశాయి. సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొన్నాయి.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు..
దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. మద్యం తయారీదారులు, రిటైల్, టోకు వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీ రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ. మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయకుముందే.. ఆ డాక్యుమెంట్ వ్యాపారుల వాట్సాప్ గ్రూప్​లలో ప్రత్యక్షమైందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు, ఇదే కేసులో మనీలాండరింగ్​కు సంబంధించిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

Last Updated : Mar 9, 2023, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.