ETV Bharat / bharat

షూటింగ్​ లొకేషన్​లోనే యువ డైరెక్టర్​ అరెస్ట్​- రేప్​ ఆరోపణలతో... - Malayalam film director Liju Krishna

Film Director Arrested: అత్యాచారం కేసులో.. మలయాళ సినిమా డైరెక్టర్​ను అరెస్టు చేశారు పోలీసులు. షూటింగ్​ లొకేషన్​లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Debutant Malayalam film director arrested in rape case

author img

By

Published : Mar 8, 2022, 10:28 AM IST

Film Director Arrested: మలయాళ సినీ పరిశ్రమకు చెందిన యువ డైరెక్టర్​ లిజు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని కన్నూర్​లో జరిగిందీ ఘటన. తనపై అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఆరోపించిన నేపథ్యంలో.. షూటింగ్​ లొకేషన్​లోనే ఆదివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ దర్శకుడిని కొచికి తరలించి.. మేజిస్ట్రేట్​ ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.

2020 డిసెంబర్​ నుంచి 2021 జూన్​ మధ్య బాధితురాలిపై పలుమార్లు.. డైరెక్టర్​ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఫిర్యాదు మేరకు కృష్ణపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

లిజు కృష్ణ ప్రస్తుతం 'పాడవేట్టు' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నటుడు సన్నీ వేన్​ నిర్మాత. కృష్ణ అరెస్టుతో షూటింగ్​ తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇవీ చూడండి: 'అతివ'ను వీడని అసమానతలు.. అన్నింటా అంతంత మాత్రమే!

కొంగులు బిగించి రంగంలోకి.. గాంధీజీనే నిలదీసిన నారీమణులు!

మ్యూజిక్​ నుంచి కిక్ బాక్సింగ్ వరకు.. 60+ కళల్లో ఈమె క్వీన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.