ETV Bharat / bharat

క్రేజీ లవర్​.. వరుడి ముందే ప్రియురాలి నుదుట సింధూరం.. పెళ్లి క్యాన్సిల్​! - crazy lover applied vermilion to the bride

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. కాసేపట్లో వధువు మెడలో మూడుముళ్లు పడతాయనగా ఓ ప్రేమికుడు చేసిన పనికి.. ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఆ వరుడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

crazy lover applied vermilion to the bride in front of the groom in ghazipur UP
కాబోయే భర్త ముందే యువతికి బొట్టు పెట్టిన మాజీ ప్రేమికుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వరుడు!
author img

By

Published : May 18, 2023, 6:29 PM IST

Updated : May 18, 2023, 6:36 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజిపుర్​ జిల్లాలో ఓ ప్రేమికుడు చేసిన నిర్వాకానికి ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు ఓ వరుడు. కాసేపట్లో వధువు మెడలో మూడుముళ్లు పడతాయని అనుకున్న సమయంలో జరిగిన సంఘటనను చూసి ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. అందరూ చూస్తుండగానే పెళ్లి మండపంలోనే అమ్మాయి నుదుటన సింధూరం పెట్టాడు. అసలేం జరిగిందంటే?

ఇదీ జరిగింది..
గాజిపుర్​ జిల్లాలోని బైరన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు గతంలో ప్రేమించుకున్నారు. పలు కారణాలతో వారు కొంత కాలం క్రితం విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆ యువతికి వేరే గ్రామానికి చెందిన అబ్బాయితో మే 17న పెళ్లిని నిశ్చయించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో వధువు తన ప్రియుడికి ఎవరూ ఊహించని సవాల్​ విసిరింది. జైమాల్​ (పెళ్లికి ముందు పూలదండలు మార్చుకుని ఒకరికొకరు సింధూరం పెట్టుకునే ప్రక్రియ) జరిగే వేదికపైకి వచ్చి తనకు బొట్టు పెట్టాలని అతడిని కోరింది. దీంతో అతడు సరిగ్గా జైమాల్​ కార్యక్రమం ప్రారంభానికి ముందు వధూవరులు ఉన్న వేదికపైకి వచ్చి తన ప్రియురాలి నుదుటన తిలకం దిద్దాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్​కు గురయ్యారు. దీనిని గమనించిన వరుడు తనకీ పెళ్లొద్దంటూ తేల్చిచెప్పేశాడు. దీంతో పెళ్లి మండపం నుంచి వరుడు సహా అతడి బంధువులు వెనుదిరిగారు.

మరోవైపు వధువుకు కుంకుమ పెట్టిన వెంటనే ఆ మాజీ ప్రేమికుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న గ్రామస్థులు అతడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కట్నకానుకలు తిరిగి ఇచ్చేయండి!
మే17న బుధవారం వివాహం జరగాల్సి ఉండగా.. వరుడు మే16 మంగళవారం రాత్రి ఊరేగింపుగా వధువు నివాసానికి కుటుంబసభ్యులతో చేరుకున్నాడు. ఈ క్రమంలో జైమాల్​ కోసం పెళ్లికొడుకు, పెళ్లికుమార్తె ఇద్దరు కలిసి వేదికపైకి ఎక్కి పూలమాలలు మార్చుకున్నారు. అనంతరం వరుడు.. వధువు నుదుటిపై కుంకుమను పెట్టే క్రమంలో ఒక్కసారిగా స్టేజీపైకి వచ్చిన ప్రేమికుడు ఆ యువతికి సింధూరం పెట్టి ఆమె విసిరిన సవాల్​​ను ఎదుర్కున్నాడు. అక్కడే ఉన్న వరుడు ఇదంతా చూసి యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. పెళ్లికొడుకు నిర్ణయంతో ఏకీభవించిన వధువు కుటుంబీకులు వివాహం కోసం చేసిన ఖర్చులతో పాటు కట్నకానుకలను కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో చేసేదేమిలేక కట్నాన్ని తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్నాడు వరుడు.

గతంలోనూ చెడగొట్టాడు!
యువతి పెళ్లి రద్దవడానికి కారణమైన యువకుడిని అరెస్ట్​ చేశామని ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు. నిందితుడు.. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడని.. ఇది వన్ సైడ్ లవ్ కేసు అని ఆయన అన్నారు. అయితే యువతికి గతంలో కూడా ఓ వివాహం నిశ్చయం కాగా అక్కడకూ వెళ్లి పెళ్లిని చెడగొట్టినట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. ఈ ఘటనపై కూడా అతడిపై కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. మొత్తంగా తాజాగా జరిగిన ఘటనలో ప్రేమికుడిపై వధువు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.

Last Updated : May 18, 2023, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.