Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 20,408 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 20,958 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.
- మొత్తం కేసులు : 4,40,00,138
- మొత్తం మరణాలు: 5,26,312
- యాక్టివ్ కేసులు: 1,43,384
- కోలుకున్నవారి సంఖ్య: 4,33,30,442
Vaccination India: భారత్‌లో శుక్రవారం 33,87,173 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 203.94 కోట్లు దాటింది. మరో 4,04,399 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,36,173 మంది వైరస్ బారినపడగా.. మరో 1,917 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,07,00,946కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,17,323 మంది మరణించారు. ఒక్కరోజే 8,62,421 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,06,76,713కు చేరింది.
- జపాన్‌లో 2,30,055 కేసులు నమోదు కాగా.. 116 మంది మరణించారు.
- అమెరికాలో తాజాగా 99,061 కేసులు నమోదు కాగా.. 286 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా 85,275 మందికి కరోనా సోకింది. 35 మంది బలయ్యారు.
- ఇటలీలో తాజాగా 54,088 మందికి కరోనా సోకింది. 244 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 45,515 మందికి వైరస్ సోకగా.. 89 మంది మరణించారు.
ఇదీ చూడండి : బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ