Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 15,528 మంది వైరస్ బారినపడగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,113 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు : 4,37,83,062
- మొత్తం మరణాలు: 5,25,785
- యాక్టివ్ కేసులు: 1,43,654
- కోలుకున్నవారి సంఖ్య: 4,31,13,623
Vaccination India: భారత్‌లో సోమవారం 27,78,013 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.5 కోట్లు దాటింది. మరో 4,68,350 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 6,37,016 మంది వైరస్ బారినపడగా.. మరో 1,128 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,84,50,463కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,89,332 మంది మరణించారు. ఒక్కరోజే 8,91,562 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,96,37,997కు చేరింది.
- జర్మనీలో కొత్తగా 1,60,691 మందికి వైరస్ సోకింది. 102 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్‌లో కొత్తగా 1,03,602 మందికి కరోనా సోకింది. మహమ్మారితో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 58,177 మందికి వైరస్ సోకగా.. 149 మంది మరణించారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 39,106 మందికి వైరస్ సోకగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 38,697 కేసులు నమోదు కాగా.. 143 మంది మరణించారు.
ఇవీ చూడండి : రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. ముర్ముకే జై!