ETV Bharat / bharat

ఆ ఎన్నికల్లో 40% టికెట్లు మహిళలకే: ప్రియాంక - up election priyanka gandhi

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల (UP election 2022) దృష్ట్యా.. కాంగ్రెస్​ వ్యూహాత్మక అడుగువేసింది. 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయించనున్నట్లు ప్రకటించారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా(UP election priyanka gandhi).

ఎన్నికల్లో మహిళలకే 40 శాతం టికెట్లు
author img

By

Published : Oct 19, 2021, 2:56 PM IST

వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు(UP election 2022) జరగనున్న వేళ.. కాంగ్రెస్(Congress news​)​ కీలక ప్రకటన చేసింది. 40 శాతం టికెట్లు మహిళలకే ఇవ్వనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(UP election priyanka gandhi) స్పష్టం చేశారు.

''అధికారంలో మహిళలు పూర్తి స్థాయి భాగస్వామి కావాలని మేం కోరుకుంటున్నాం. మహిళల సాధికారత కోసమే కాంగ్రెస్​ ఈ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రాజకీయ ఉద్దేశం, ఇతర అజెండాలు ఏమీ లేవు.''

- ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

రానున్న ఎన్నికల్లో గెలుపే తమ లక్ష్యమని, అందుకే మహిళలకు సింహభాగం కేటాయించినట్లు పేర్కొన్నారు ప్రియాంక. కులమతాల పట్టింపుల్లేకుండా.. మెరిట్​ ప్రాతిపదికన సీట్లు దక్కుతాయని వెల్లడించారు. లఖ్​నవూలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె(UP election priyanka gandhi).. భాజపాపై ఆరోపణలు గుప్పించారు.

లఖింపుర్​ ఖేరి ఘటన నిందితులను భాజపా రక్షిస్తోందని, బాధితులు మాత్రం న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు ప్రియాంక.

''హాథ్రస్​, లఖింపుర్​లో ఏం జరిగిందో చూశాం. అలాంటి భాజపా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?''

- ప్రియాంకా గాంధీ

2017లో జరిగిన అసెంబ్లీ(UP election 2022) ఎన్నికల్లో 312 స్థానాలు గెల్చుకొని.. యూపీలో భాజపా అధికారంలోకి వచ్చింది. సమాజ్​వాదీ పార్టీ 47, బహుజన్​ సమాజ్​ పార్టీ 19 చోట్ల గెలవగా.. కాంగ్రెస్​ (Congress news​) మాత్రం 7 స్థానాలకే పరిమితమైంది. యూపీ శాసనసభలో మొత్తం 403 స్థానాలున్నాయి.

ఇదీ చూడండి: జొమాటోకు 'హిందీ' సెగ.. తమిళనాడులో రచ్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.