ETV Bharat / bharat

CITD Report Evidence that Skill Training is True: సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఇచ్చింది వాస్తవం..నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా వాదిస్తున్న సర్కారు

CITD Report Evidence that Skill Training is True: చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధి నిజం. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో క్లస్టర్‌కు 559కోట్ల34 లక్షల రూపాయల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సేవలూ అందించిందీ వాస్తవం. అంటే 6 క్లస్టర్లలో పరికరాల విలువ 3,356 కోట్లు రూపాయలు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ టూల్ డిజైన్-సీఐటీడీ మదింపు నివేదికే.. దీనికి నిలువెత్తు సాక్ష్యం. అయినా అప్పటి సీఎం చంద్రబాబును ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. నిధుల్ని మళ్లించారంటూ సీఐడీ కేసు పెట్టి జైలుకు పంపింది.

CITD_Report_Evidence_that_Skill_Training_is_True

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 6:57 AM IST

Updated : Sep 14, 2023, 9:03 AM IST

CITD Report Evidence that Skill Training is True: సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఇచ్చింది వాస్తవం..నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా వాదిస్తున్న సర్కారు

CITD Report Evidence that Skill Training is True : సీమెన్స్ ప్రాజెక్టులో పరికరాల విలువను మదింపు చేయాలని.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)కి 2016 మార్చిలో నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి.. లేఖ రాశారు. ఈ విషయం అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ తెలుసు. అయినా ఒక్కరూ దీనిపై నోరు మెదపడం లేదు. మదింపు నివేదిక అంశాన్ని ప్రస్తావించడం లేదు. కనీసం కేసు విచారిస్తున్న సీఐడీకి అయినా ఈ విషయం తెలుసా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Skill Training is True During Chandrababu Regime : అధికారులు చెబుతున్నట్లు కార్పొరేషన్ ద్వారా డబ్బు బయటకు వెళ్లి ఉంటే.. ఒక్కో క్లస్టర్లో 559 కోట్ల 34 లక్షల రూపాయల విలువైన పరికరాలు ఉన్నాయని సీఐటీడీ మదింపు నివేదిక ఎలా ఇచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్రాలకు వస్తే అన్నీ చూపిస్తాం, రశీదులతో సహా వివరాలిస్తామని డిజైన్‌టెక్‌ సిస్టమ్స్ చెబుతున్నా ఎందుకు విస్మరిస్తున్నారన్న దానిపై సందేహం కలుగుతోంది.

Design Tech MD Vikas Khanvilkar Reacts to CBN Arrest: స్కిల్ ఒప్పందంలో అవినీతికి తావేలేదు.. చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం..: డిజైన్‌టెక్‌ ఎండీ
Prema Chandra Reddy Wrote a Letter to CITD : సీమెన్స్ ప్రాజెక్టుకు (Siemens Project) సంబంధించి విలువ మదింపు నివేదిక ఇవ్వాలని సీఐటీడీకి లేఖ రాసిన ప్రేమ చంద్రారెడ్డి.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్ ఆధ్వర్యంలో సీమెన్స్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, సాంకేతిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని అందులో వివరించారు. ప్రాజెక్టు అమరికల మూల్యాంకనంలో సేవలందించాలని సీఐటీడీని అభ్యర్థించారు. అందుకు అనుగుణంగా మదింపు నివేదిక రూపొందించే పనిని స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్‌, ఇన్నోవేషన్ శాఖ ద్వారా అప్పగించారు.

నైపుణ్యాభివృద్ధి శాఖ అభ్యర్ధన మేరకు సీఐటీడీ (Central Institute of Tool Design ).. 6 క్లస్టర్లలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సేవల వివరాలను సమగ్రంగా పరిశీలించింది. సీమెన్స్ ప్రాజెక్టులో క్లస్టర్ వారీగా ప్రాజెక్టు వ్యయం.. 559 కోట్ల 34 లక్షల రూపాయలుగా ఉంది. ఆ మేరకు అన్ని వివరాలు తీసుకుని మదించింది. ఆ ఖర్చును అంచనా వేసిన తర్వాత.. అంచనా వ్యయం, మదింపు వివరాలు సరిపోలాయని తేల్చింది. శిక్షణ, ఇంటర్వ్యూ, బృంద చర్చలు, ప్రొఫైల్ సృష్టించడం, మాక్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులు ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలనే అంశాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలను పరిశీలించింది. విద్యార్థి శిక్షణకు సంబంధించిన పత్రాల నిర్వహణ, డ్యాష్ బోర్డుతో పాటు సీఈఓ స్థాయిలో రోజు వారీ, వారాంతపు సమీక్షలు, భాగస్వాములతో నెల వారీ, త్రైమాసిక, వార్షిక సమీక్షల వివరాలను పరిశీలించింది.

Ajeya kallam and Premchandra Reddy Approved the Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టును ఆమోదించింది అజేయకల్లం: పీవీ రమేశ్‌

సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం 371 కోట్లు రూపాయలు విడుదల చేసిందని వాటిని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కంపెనీలకు మళ్లించారని సీఐడీ కేసు నమోదు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీలోనూ ఇదే విషయం చెప్పారు. ప్రభుత్వం చెప్పేది నిజమే అయితే.. క్లస్టర్ల వారీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నిర్వహణ తదితరాలకు సొమ్ము ఎక్కణ్నుంచి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం లేదు. సీఐటీడీ మదింపు నివేదికలోని వివరాలతో సీమెన్స్ సంస్థ ఇచ్చిన అంచనాలు సరిపోయాయి. అంటే ప్రాజెక్టు అమలు జరిగినట్లే కదా? అయినా ప్రభుత్వం డిజైన్‌టెక్‌ ద్వారా నిధుల్ని మళ్లించారని అడ్డగోలుగా వాదిస్తోంది.

సీమెన్స్ సంస్థతో జగన్ ప్రభుత్వం కుమ్మక్కైంది.. ధూళిపాళ్ల నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

Last Updated : Sep 14, 2023, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.