ETV Bharat / bharat

'సరిహద్దులో శాంతి కోసం కేంద్రం ప్రయత్నం' - ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో మోదీ సమావేశం

అసోం-మిజోరం సరిహద్దు వివాదానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు కేంద్రం కృషి చేస్తోందని మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు తెలిపారు. సోమవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మరోవైపు.. అసోం భాజపా ఎంపీలు కూడా మోదీతో సమావేశమయ్యారు.

mizoram governor k.haribabu
మిజోరం గవర్నర్ కె.హరిబాబు
author img

By

Published : Aug 2, 2021, 4:02 PM IST

అసోం, మిజోరం మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం.. సరిహద్దు వివాదంపై పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని హరిబాబు స్పష్టం చేశారు.

"అసోం, మిజోరం మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణలు.. అత్యంత దురదృష్టకరమైనవి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ఈ సమస్యకు ఓ పరిష్కారం కనగొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రయత్నిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతి పునురుద్ధరణకు కట్టుబడి ఉన్నారు."

-హరిబాబు, మిజోరం గవర్నర్​.

మరోవైపు.. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్​ సహా అసోంకు చెందిన భాజపా ఎంపీలతోనూ మోదీ సమావేశమయ్యారు.

అసోం-మిజోరం సరిహద్దుల్లో జులై 26న జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అసోం పోలీసులు మరణించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత, ఆరుగురు అధికారులు సహా మరో 200 మంది వ్యక్తులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

ఆయనపై ఎఫ్​ఐఆర్​ వాపస్​కు ఆదేశాలు..

అయితే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం రాజ్యసభ ఎంపీ కె.వన్లాల్​వేనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకోవాలని తాను రాష్ట్ర పోలీసులను ఆదేశించానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోమవారం తెలిపారు. సహృద్భావంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే.. మిగతా పోలీసులపై కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

"వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని మిజోరం ముఖ్యమంత్రి జోరమ్​తంగ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు.. ఎల్లప్పుడూ బలంగా ఉండేందుకు అసోం ప్రయత్నిస్తుంది. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు అసోం ఎల్లప్పడూ కట్టుబడి ఉంటుంది. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో.. ఎంపీ కె.వన్లాల్​వేనాపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకోవాలని నేను రాష్ట్ర పోలీసులను ఆదేశించాను."

-హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి.

ఇతర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భాజపా ఎంపీలు కూడా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సోమవారం కలిశారు. ఈ సున్నితమైన అంశాన్ని కాంగ్రెస్​.. రాజకీయం చేస్తోందని వారు ఆరోపించారు. సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని మోదీకి వారు వినతిపత్రాన్ని సమర్పించారు. వివాదాస్పద ప్రకటనలతో విదేశీ శక్తులు.. సరిహద్దు విభేదాలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు.

మరోవైపు.. హిమంతపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను తాము ఉపసంహరిస్తామని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చువాంగో ఆదివారం తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.