అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్(Anil Deshmukh news) నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు చేపట్టింది. దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కీలక పత్రాలు లీకైన ఘటనలో ముంబయి, నాగ్‌పుర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది.
అవినీతి కేసులో దేశ్‌ముఖ్‌పై ప్రాథమిక విచారణకు సంబంధించిన రహస్య పత్రాలను లీక్ చేసినందుకు ఆయన తరఫు న్యాయవాదితోపాటు మరో సెబ్ఇన్స్పెక్టర్ను సెప్టెంబర్ 2న అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది.
దేశ్‌ముఖ్‌పై(Anil Deshmukh news) దాఖలైన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ప్రాథమిక విచారణను మొదలుపెట్టింది. అవినీతి కేసుకు సంబంధించి అనిల్ దేశ్‌ముఖ్‌కు క్లీన్‌చీట్ ఇచ్చారన్న విషయం మీడియాకు లీక్ కాగా.. దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై స్వయంగా రంగంలోకి దిగిన సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఇదీ చూడండి: మహారాష్ట్ర బంద్‌లో ఉద్రిక్తత- 9 బస్సులు ధ్వంసం