ETV Bharat / bharat

ఏబీజీ షిప్‌యార్డు ఛైర్మన్‌పై సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు - సీబీఐ లుక్​ అవుట్​ నోటీసులు

ABG Shipyard Fraud: ఇటీవల బయటపడ్డ ఏబీజీ షిప్​యార్డు స్కామ్​కు సంబంధించిన ఆ సంస్థ ఛైర్మన్​ సహా మరో 8 మందిపై సీబీఐ లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని విమానాశ్రయాలు, సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అధికారులు.

ukraine russia conflict
ఏబీజీ
author img

By

Published : Feb 16, 2022, 1:16 AM IST

ABG Shipyard Fraud: గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డు సంస్థ 28 బ్యాంకులకు రూ.22,842 కోట్ల మేర మోసగించిన వ్యవహారం దేశంలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషి కమలేశ్‌ అగర్వాల్‌తో పాటు మరో ఎనిమిది మందికి సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. దేశంలోనే భారీగా బ్యాంకులకు రుణాల ఎగవేత మోసంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. నిందితులు దేశం విడిచి ఎక్కడికీ పారిపోకుండా మంగళవారం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు దేశంలోని విమానాశ్రయాలు, సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

మరోవైపు, ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలపై నమోదైన కేసులో కంపెనీ డైరెక్టర్లు రిషి అగర్వాల్‌, ముత్తుస్వామి, అశ్వినీ కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి కంపెనీ యాజమాన్యం రుణాలు తీసుకుని నిధులను మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ సంస్థ నౌకల తయారీ, మరమ్మతులు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో యార్డులు ఉన్నాయి.

ఇదీ చూడండి : 'మతాచారాలు ప్రదర్శించడం దేశ వైవిధ్యానికి చిహ్నం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.