ETV Bharat / bharat

చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు స్నేహితులు దుర్మరణం - manmad accident latest news

Road accident in Maharashtra: కారు అదుపుతప్పి చెట్టిన ఢీకొట్టగా నలుగురు స్నేహితులు దుర్మరణం చెందిన దుర్ఘటన మహారాష్ట్రలోని మన్మాడ్​ నగరంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కారుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

manmad accident news
చెట్టును ఢీకొని.. నలుగురు స్నేహితులు దుర్మరణం
author img

By

Published : May 11, 2022, 9:34 AM IST

Road accident in Maharashtra: మహారాష్ట్రలోని మన్మాడ్​ నగరంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడం వల్ల నలుగురు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ కార్యక్రమానికి హాజరై మన్మాడ్​కు తిరిగి వస్తున్న క్రమంలో పుణె- ఇందోర్​ రహదారిపై ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

manmad accident news
నలుగురు స్నేహితులు దుర్మరణం

మన్మాడ్​కు చెందిన ఐదుగురు స్నేహితులు.. యోలా ప్రాంతానికి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా మన్మాడ్​కు సమీపంలోని అనక్వాడ్​ వద్ద కారుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కనే ఉన్న వృక్షాన్ని ఢీకొట్టింది కారు. అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల కారు నుజ్జునుజ్జయింది. మృతులు.. తౌఫిక్​​ షేక్​, దినేశ్​ భాలేరావ్​, ప్రవీణ్​ సకట్​​, గోకుల్​ హిరేగా గుర్తించారు. అజయ్​ వాంఖడే తీవ్రంగా గాయపడగా మన్మాడ్​కు తరలించారు.

ఇదీ చూడండి: దారుణం.. లిఫ్ట్​లో తల ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం

కన్నకూతురిపై అత్యాచారం.. నిందితుడికి 106 ఏళ్ల జైలుశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.