ETV Bharat / bharat

Visakha Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డీవైడర్​ను, చెట్టును ఢీకొట్టి.. బైక్​ను సైతం.. ముగ్గురి మృతి

author img

By

Published : Aug 8, 2023, 8:22 AM IST

Car Accident in Visakha: విశాఖలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మీతిమీరిన వేగంతో కారు నడిపడటంతో ప్రమాదం జరగగా.. ప్రమాద స్థాయి సినిమాలోని యాక్షన్​ సీన్​ను తలపించేలా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

bike and car accident in visakha
విశాఖలో కారు ప్రమాదం

Visakha Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డీవైడర్​ను, చెట్టును ఢీకొట్టి.. బైక్​ను సైతం.. ముగ్గురి మృతి

Car Accident in Visakha: విశాఖ - భీమిలి రహదారిలో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడపడం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ప్రమాద సమయంలో అక్కడున్న స్థానికులు ప్రమాదం జరిగిన తీరును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని సాగర్‌నగర్‌ నుంచి ఎండాడ వైపుగా వెళ్తున్న ఓ కారు.. రాడీసన్‌ హోటల్‌ మలుపు వద్దకు చేరుకోగానే అదుపు తప్పి.. రోడ్డు మధ్యలో గల డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా చెట్టును ఢీకొట్టి రోడ్డు అవతలికి దూసుకుపోయింది. అదే సమయంలో అటునుంచి ద్విచక్ర వాహనం వస్తోంది. ఆ వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

కారు- డంపర్​ ఢీ.. గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లిన 'జాగ్వార్​'.. 9మంది మృతి

visakha car accident: రోడ్డు అవతలికి దూసుకువచ్చిన కారు.. వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు, బీచ్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు పృథ్వీరాజ్‌(28), ప్రియాంక(21) దంపతులని.. వీరు ఒడిశాలోని రాయగడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పృథ్వీరాజ్‌ ఓ సంస్థలో సైట్​ ఇంజనీర్​గా పనిచేస్తున్నట్లు సమాచారం. కారు ప్రమాదా(Accident)న్ని నేరుగా చూసిన వారు సినిమాను తలపించేలా ఉందన్నారు.

Road accident: ప్రమాదానికి కారణమైన కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వెనక సీట్లో కూర్చున్నవారిలో ఎం. మణికుమార్‌(25) తీవ్రంగా గాయపడి కారులోనే కన్నుమూశారు. ఇతడు పీఎం పాలెంలోని ఆర్​హెచ్​ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను చికిత్స నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు వివరించారు. ప్రమాదానికి గురైన కారులో పోలీసులు మద్యం సీసాలను గుర్తించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పల్టీలు కొట్టి రోడ్డుపై గింగిరాలు తిరిగిన కారు.. ప్రయాణికులంతా సేఫ్

"అతివేగంగా అవతలి రోడ్డలో వెళ్తున్న కారు ఇవతలి వైపుకు వచ్చి.. బైక్​పై వెళ్తున్న ఇద్దర్ని ఢీ కొట్టింది. దీంతో వారు అదుపుతప్పి పడిపోయారు. ఇద్దరూ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ముందు కూర్చున్నవారికి బెలూన్స్​ ఓపెన్​ కావటంతో స్వల్పగాయాలయ్యాయి. కారులో వెనక కూర్చున వ్యక్తి ప్రమాదంలోనే మరణించారు. కారులోని వారు మద్యం తాగినట్లు ఉన్నారు. కారులో మద్యం బాటిల్​ లభ్యమైంది." -మూర్తి, ద్వారకా ఏసీపీ

ప్రమాదానికి ముందు వివాదం: కారులో ఉన్న ఆరుగురు యువకులు అప్పటికే మద్యం తాగి ఉన్నారు. కారు జోడుగుళ్లపాలెం తీరం నుంచి సాగర్‌నగర్‌ వైపు వచ్చింది. సాగర్​నగర్​ ఆర్చ్​ దగ్గర అక్కడి యువకులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపైనే మద్యం సీసాలను పగలగొట్టి నానా హైరానా చేశారు. ఆక్కడి యువకుల వద్ద నుంచి సెల్​ఫోన్​ లాక్కుని సాగర్​నగర్​ ఆర్చ్​ నుంచి వెళ్లిపోయారు. దీంతో సాగర్​నగర్​ యువకులు జోడుగుళ్లపాలెం చెక్‌పోస్టు వద్ద ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అంతలోనే వారికి ప్రమాదం సమాచారం తెలిసింది. సాగర్​నగర్​ యువకులను పోలీసులు ఘటనాస్థలానికి తీసుకెళ్లటంతో వారు కారును గుర్తించారు.

'ఇదే మా చివరి పాట'.. మరణంలోనూ వీడని స్నేహం.. సరదాగా ఆడిపాడిన కొన్ని నిమిషాలకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.