ETV Bharat / bharat

'ఆర్థిక వ్యవస్థకు బూస్టర్​ డోస్​- సామాన్యులకు నమ్మకద్రోహం!' - బడ్జెట్​పై భాజపా

Congress on Budget 2022: కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్​పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భారత్​ను ఆత్మనిర్భర దేశంగా తీర్చిదిద్దేందుకు నిర్మల పద్దు ఉపకరిస్తుందని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. అయితే... ఈ బడ్జెట్ ద్వారా పేదలు, వేతన జీవులకు కేంద్రం నమ్మకద్రోహం చేసిందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.

budget 2022
బడ్జెట్
author img

By

Published : Feb 1, 2022, 5:04 PM IST

BJP on Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ​ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించనదని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఈ బడ్జెట్​ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా భారత్​ను ఆత్మనిర్భర్​గా తీర్చిదిద్దుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం 100 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకునే నాటికి నవ భారత్​ అవతరించేందుకు ఈ బడ్జెట్​ పునాది అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు అమిత్ షా.

"మహమ్మారి సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈసారి బడ్జెట్​ను రూ.39.45 లక్షల కోట్లకు పెంచడమే అందుకు ఉదాహరణ. ద్రవ్యలోటును 6.9 నుంచి 6.4 శాతానికి తగ్గించడం ప్రభుత్వానికి పెద్ద విజయం. మోదీ నాయకత్వంలో త్వరలోనే ఈ ద్రవ్యలోటు 4 శాతానికి దిగువకు చేరుతుందని నాకు నమ్మకం ఉంది. వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, ఆత్మనిర్భర్​గా తయారుచేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం ఈ బడ్జెట్​లో ప్రతిబింబిస్తుంది. జీరో బడ్జెట్​ ఫార్మింగ్, నేచురల్​ ఫార్మింగ్​, ఫార్మర్​ డ్రోన్స్​, నదుల అనుసంధానం వంటి అంశాలే అందుకు ఉదాహరణ."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

ఈ బడ్జెట్​పై ఇతర కేంద్ర మంత్రులు సహా భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

"ఇది చాలా మంచి బడ్జెట్​. సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తీర్చిదిద్దారు. పేదలు, గ్రామీణ, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారికి సహా ఈశాన్య రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంది."

-కిరణ్​ రిజిజు, కేంద్ర మంత్రి

"ఈ బడ్జెట్​ ఆత్మనిర్భర్​ భారత్​ సాధించేందుకు మరిన్ని అవకాశాలను కల్పిస్తోంది. మహమ్మారి వేళ కూడా ఈ బడ్జెట్​తో ఆత్మనిర్భర్​ భారత్​ లక్ష్య సాధనకు ఊతం అందినట్లైంది."

-ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి

"ఇది సామాన్యడి బడ్జెట్. మౌలిక వసతుల కేటాయింపులో 35 శాతం పెంచారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది. ఇది దేశంలో తయారీ రంగానికి బూస్టర్​ షాట్​."

-రాజ్యవర్ధన్​ సింగ్​ రాఠోడ్, భాజపా ఎంపీ

"ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్. ఈ బడ్జెట్ భారత్​ను ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. భారీగా కేటాయింపులు చేయడం ఈ బడ్జెట్​ ప్రత్యేకత. పర్యావరణహిత, డిజిటల్​ భారత్​ లక్ష్యంగా దీనిని తయారు చేశారు."

-అమితాబ్​ కాంత్, నీతీ ఆయోగ్​ సీఈఓ

ఇది జీరో బడ్జెట్

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఈ బడ్జెట్​తో ఎలాంటి ఉపయోగం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్​ను 'జీరో సమ్​ బడ్జెట్'​గా అభివర్ణించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.

"ఇది జీరో సమ్​ బడ్జెట్​. ఇందులో వేతన జీవులు, పేదలు, మధ్యతరగతి వారికి ఏమీ లేదు. యువత, రైతులు, ఎంఎస్​ఎంఈలకు సంబంధించి కూడా కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

"ఈ బడ్జెట్​ కేవలం ధనికులకే. పేదలకు దీనితో ఏం సంబంధం లేదు. ఇది అర్జున-ద్రోణాచార్య బడ్జెట్​, ఏకలవ్యుడిది కాదు. ఇందులో క్రిప్టోకరెన్సీ గురించి కూడా ప్రస్తావించారు. అసలు వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చట్టం లేదు. దాని గురించి ఇంతకుముందు చర్చించనూ లేదు. ఈ బడ్జెట్​ను కేవలం వారి స్నేహితులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు."

-మల్లికార్జున్​ ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత

"ఈ బడ్జెట్​ పూర్తి నిరాశ కలిగించింది. ఇందులో ఏమీ లేదు. ఎంజీఎన్​ఆర్​ఈజీఏ, రక్షణ సహా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ బడ్జెట్​తో అచ్చేదిన్​ అనే ఎండమావిని మరింత దూరం జరిపినట్లు అయింది. ఇప్పుడు ఆ అచ్చేదిన్​ కోసం మరో పాతికేళ్లు వేచిచూడాలి."

-శశి థరూర్​, కాంగ్రెస్ ఎంపీ

"మహమ్మారి వేళ దేశంలో వేతన జీవులు, మధ్యతరగతికి చెందిన వారు కేంద్రం ఊరట కల్పిస్తుందని ఆశించారు. కానీ ప్రధాని, ఆర్థిక మంత్రి మరోసారి వారిని నిరాశపరిచారు. ఈ బడ్జెట్​తో వారికి కేంద్రం నమ్మకద్రోహం చేసింది. క్రిప్టో బిల్లు ప్రవేశపెట్టకుండానే పన్ను ఎలా విధిస్తారు. అసలు క్రిప్టో కరెన్సీ చట్టబద్ధమేనా? ప్రజలకు స్పష్టతను ఇవ్వండి."

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి

పెగసస్​​ స్పిన్​ బడ్జెట్

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​.. 'పెగసస్​ స్పిన్​ బడ్జెట్'​ అని ఎద్దేవా చేశారు బంగాల్​ సీఎం, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ.

"నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్రం ఈ బడ్జెట్​లో ఏమీ కేటాయించలేదు. భారీ ప్రకటనలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇది పెగసస్​ స్పిన్​ బడ్జెట్."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఎవరికోసం ఈ బడ్డెట్​?

ఈ బడ్జెట్​ ఎవరిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినది అని ప్రశ్నించారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరి. సంపన్నులకు పన్నును ఎందుకు పెంచలేదంటూ విమర్శించారు.

"ఈ బడ్జెట్​ ఎవరి కోసం? 10 శాతం మంది భారతీయుల దగ్గర 75 శాతం దేశ సంపద ఉంది. 60 శాతం మంది పేదల వద్ద 5 శాతం మాత్రమే సంపద ఉంది. నిరుద్యోగం, పేదరికం, ఆకలి బాధలు పెరుగుతుంటే మహమ్మారి వేళ లాభాలు అర్జించిన వారికి పన్నును ఎందుకు పెంచరు?"

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

వ్యాపారవేత్తలు ఏమన్నారంటే..

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రముఖ వ్యాపారవేత్తలు ట్విట్టర్​ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

"దేశ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే (సబ్కా ప్రయాస్​) కేంద్రం పిలుపునకు మేము స్వాగతిస్తున్నాం. దేశ నిర్మాణం, ఉపాధి కల్పనకు ప్రైవేటు రంగం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం, ప్రజలకు కలిసి పనిచేస్తాం."

-అనిల్​ అగర్వాల్​, వేదాంత రిసోర్సెస్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​

"సంక్షిప్తత చాలా ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సంక్షిప్త బడ్జెట్​ ప్రసంగం చాలా ప్రభావవంతమైనది రుజువు అవుతుంది."

-ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్

"సులభతర వాణిజ్యమే ధ్యేయంగా ఈ బడ్జెట్​ను రూపొందించారు. మౌలిక రంగానికి 35 శాతం ఎక్కువ కేటాయింపు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇది ఓ బ్యాలెన్స్​డ్​ బడ్జెట్​."

-కిరణ్​ మజుందార్​, బయోకాన్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్

"కేపెక్స్​, డిజిటల్​, సంక్షేమాలపై దృష్టి సారిస్తూ తయారు చేసిన ఈ బడ్జెట్​తో భవిష్యత్తు ఎంత మెరుగ్గా ఉంటుందో నేను ఊహించగలను."

-హర్ష్​ గోయెంకా, ఆర్​పీజీ ఎంటర్​ప్రైజెస్ ఛైర్మన్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : 'సామాన్యుడి ఆశలకు అనుగుణంగా బడ్జెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.