ఉత్తర్ప్రదేశ్ అమేఠీలోని జైసలో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసేందుకు వెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. భాజపా కార్యకర్తలు, జైస మున్సిపల్ అధ్యక్షుడు, ఆయన తనయుడు.. ఆ మహిళలపై దాడి చేశారు.
అమేఠీలోని జైస్లో శుక్రవారం పర్యటించిన ఇరానీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే ఆమె పర్యటనకు కొద్ది గంటల ముందు కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. ఇరానీతో మాట్లాడి.. వారి కష్టాలను చెప్పుకోవాలని ఎదురుచూశారు. ఇంతలో జైస మున్సిపల్ అధ్యక్షుడు మహేశ్ శొంకర్, ఆయన తనయుడు భాను శొంకర్లు ఘటనాస్థలానికి వెళ్లి వారిని కొట్టినట్టు తెలుస్తోంది.
"మేము ఎన్నో ఏళ్లుగా జైసలోనే ఉంటున్నాము. మా ప్రాంతంలో నీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. బకెట్లతో నీరు నింపుకోవాల్సి వస్తేంది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రికి వివరించాలని వెళ్లాము. ఇంతలో తండ్రీకొడుకులు మా మీద దాడి చేశారు. నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు," అని ఓ మహిళ మీడియాకు వివరించింది.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
ఇదీ చూడండి:- 'ధర్మ సంసద్'లో విద్వేష ప్రసంగం- రాహుల్, ప్రియాంక ఫైర్