BJP jumla promises: ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా ఇచ్చిన వాగ్దానమేదీ నెరవేరలేదని అన్నారు. అవన్నీ ఇప్పుడు వాగ్దానాలన్నీ అబద్ధాలేనని తేలాయని ఆరోపించారు. ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌధరితో కలిసి శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అఖిలేశ్ యాదవ్.. భాజపా తప్పుడు ప్రచారాలు చేసుకుంటోందని మండిపడ్డారు.
BJP Akhilesh yadav news
"గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను భాజపా చదువుకోవాలి. అందులో ఎన్ని హామీలు నెరవేరాయి? భాజపా ఇచ్చిన ప్రతి వాగ్దానం అబద్ధమేనని తేలింది. ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో భాజపాకు ఓటమి తప్పదు. మా కూటమి భాజపాను గద్దె దించుతుంది."
-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
UP election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందిస్తామని అఖిలేశ్ ప్రకటించారు. వ్యవసాయానికీ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. 'రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తాం. వ్యవసాయదారుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. సమాజ్‌వాదీ పెన్షన్లను తిరిగి ప్రవేశపెడతాం. గతంలో మాదిరిగానే ల్యాప్‌టాప్‌లు పంచిపెడతాం' అని హామీలు ప్రకటించారు.
ఆర్ఎల్డీ కోసం ఎన్డీఏ తలుపులు తెరిచే ఉన్నాయన్న భాజపా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పశ్చిమ యూపీలో భాజపాకు జయంత్ సింగ్ తలుపులు మూసేశారని వ్యాఖ్యానించారు.
జయంత్ సింగ్ సైతం భాజపా ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇతర పార్టీలకు ఆహ్వానం పలుకుతోందంటే రాష్ట్రంలో భాజపా పరిస్థితి దిగజారిందని అర్థమవుతోందని అన్నారు.
'హెలికాప్టర్ అడ్డుకున్నారు..'
అంతకుముందు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఎన్నికల కార్యక్రమానికి వెళ్లాల్సిన తన హెలికాప్టర్‌ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని అఖిలేశ్ ఆరోపించారు. దీంతో దిల్లీలోనే చిక్కుకుపోయానని చెప్పారు. ఈ మేరకు హెలికాప్టర్‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అధికారంలో ఉన్న భాజపా ఎన్నికల వేళ ఏం చేయడానికైనా వెనకాడటం లేదని దుయ్యబట్టారు. 'నా కంటే ముందు భాజపా నేతలు హెలికాప్టర్లో వెళ్లారు. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ అధికారులు నాతో చెప్పారు. కానీ నన్ను మాత్రం రెండు గంటలు ఎదురుచూసేలా చేశారు. భాజపా ఏమైనా చేసుకోవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేశ్. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: