ETV Bharat / bharat

'గంగమ్మకు భాజపా ద్రోహం చేసింది.. ప్రజలను మోసగించింది' - భాజపా

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల వేళ 'సమాజ్​వాదీ విజయ్​ యాత్ర'కు శ్రీకారం చుట్టారు ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. కాన్పూర్​లో జరిగిన ర్యాలీలో భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. గంగమ్మకు భాజపా ప్రభుత్వం ద్రోహం చేసిందని, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

Samajwadi Party
అఖిలేశ్​ యాదవ్​​
author img

By

Published : Oct 12, 2021, 4:10 PM IST

'గంగమ్మ'కు భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసిందని ఆరోపించారు సమాజ్​వాదీ పార్టీ అధినేత, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​. గంగా నది మునుపటిలాగే ఉందని, గంగమ్మను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

2022 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'సమాజ్​వాదీ విజయ్​ యాత్ర'ను చేపట్టారు అఖిలేశ్​ యాదవ్​. కాన్పుర్​లో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం, గంగమ్మతో పాటు ప్రజలను కూడా మోసం చేసిందని మండిపడ్డారు.

Samjwadi vijay yatra
అఖిలేశ్​ యాదవ్​

"గంగమ్మకు భాజపా ద్రోహం చేసింది. గంగా నదీ మునుపటిలాగే దుర్భరమైన స్థితిలో ఉంది. కాన్పుర్​ ఓ పెద్ద నగరం. ఇక్కడ ఉద్యోగాలున్నాయి, వ్యాపారాలున్నాయి. అవన్నీ తమ కళ్ల ముందు నాశనమవ్వడాన్ని ప్రజలు చూశారు. రైతులను కేంద్రం, రాష్ట్రంలోని భాజపా సర్కారు మోసం చేసింది. ఉద్యోగాలు లాక్కుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రజలకు భాజపా ప్రభుత్వం ద్రోహం చేసింది."

--- అఖిలేశ్​ యాదవ్​, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ సీఎం.

రాష్ట్రంలో భాజపా తుడిచిపెట్టుకుపోతుందని, దాని కోసమే విజయ్​ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు అఖిలేశ్​ వెల్లడించారు. భాజపాను గద్దె దింపి, ప్రజల ఆశీర్వాదాలు పొందేంతవరకు యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.

భాజపా స్పందన...

గంగా నది మీద అఖిలేశ్​ యాదవ్​ చేసిన విమర్శలను భాజపా తిప్పికొట్టింది. అఖిలేశ్​.. ప్రయాగ్​రాజ్​ వెళ్లాలని.. అక్కడ గంగ, యమున ఎంత శుభ్రంగా ఉన్నాయో చూడాలని సూచించింది.

ఇదీ చూడండి:- 'లఖింపుర్ హింస' ఎన్నికల్లో భాజపాను దెబ్బకొడుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.