ETV Bharat / bharat

cbi: భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందనే అరెస్టు: సీబీఐ రిమాండ్‌ రిపోర్టు

CBI remand Report: వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పులివెందుల నుంచి భాస్కర్‌రెడ్డిని తీసుకువచ్చి న్యాయస్థానం ముందు హాజరుపరిచిన సీబీఐ అధికారులు... 10 రోజుల కస్టడీకి కోరారు. భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందనే అరెస్టు చేసినట్లు సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

author img

By

Published : Apr 16, 2023, 7:30 PM IST

Updated : Apr 17, 2023, 6:36 AM IST

CBI remand Report
సీబీఐ రిమాండ్‌ రిపోర్టు

CBI remand Report: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డిని ఉదయం పులివెందులలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు హెదరాబాద్​కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అటుపై జడ్జి నివాసానికి తరలించారు. సీబీఐ జడ్జీ ముందు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హత్యకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేస్తారనే అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ తన రిపోర్టులో తెలిపింది.

14 రోజుల రిమాండ్‌: వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పులివెందుల నుంచి భాస్కర్‌రెడ్డిని తీసుకువచ్చి న్యాయస్థానం ముందు హాజరుపరిచిన సీబీఐ అధికారులు, 10 రోజుల కస్టడీకి కోరారు. భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందనే అరెస్టు చేసినట్లు సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు సెక్షన్ 55 ప్రకారం భాస్కర్‌రెడ్డి రిమాండ్ చట్టవిరుద్ధమని న్యాయమూర్తికి వివరించామని భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు.

నెల ముందే కుట్ర: వివేకా హత్యకు నెల ముందే కుట్ర పన్నినట్లు సీబీఐ రిపోర్టులో వెల్లడించింది. భాస్కర్‌రెడ్డి ఆదేశాలతోనే హత్యకు కుట్ర చేసినట్లు సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హత్యలో సహనిందితులకు పెద్దమొత్తంలో డబ్బు అందినట్లు సీబీఐ తన రిపోర్టులో పొందుపరిచింది. హత్యా స్థలంలో ఆధారాలు చెరిపేయడంలో భాస్కర్‌రెడ్డి కీలకపాత్ర వహించినట్లు సీబీఐ పేర్కొంది. వివేక హత్య కేసులో అప్పటి సీఐ శంకరయ్యను భాస్కర్‌రెడ్డి బెదిరించినట్లు రిమాండ్ సీబీఐ రిపోర్టులో వెల్లడించింది. అనుచరుల ద్వారా కీలక సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తెలిపింది.

భాస్కర్‌రెడ్డి అరెస్టుకు గల కారణాలను సీబీఐ తన రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది. కీలక సాక్షులను భాస్కర్‌రెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉందని అందులో పేర్కొంది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నాలు చేశారని వెల్లడించింది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉందని అందువల్లే... వైఎస్‌ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉందని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. హత్య కేసుకు సంబంధించిన విచారణను తప్పుదోవ పట్టించేలా భాస్కర్‌రెడ్డి సమాధానాలు ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది. విచారణకు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సహకరించడం లేదంటూ సీబీఐ తెలిపింది. కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని అరెస్టు చేసినట్లు సీబీఐ పేర్కొంది. భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందని సీబీఐ వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 17, 2023, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.