ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలి ఆత్మహత్య.. పోలీసులే కారణం! - రేప్​ కేసులు

హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. మధ్యప్రదేశ్​లో ఐదురోజుల క్రితం అత్యాచారానికి గురైన ఓ దళిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె కుటుంట సభ్యులు ఆరోపించారు.

woman-confined-allegedly-raped-for-15-days-in-jaunpur
సామూహిక అత్యాచార బాధితురాలి ఆత్మహత్య
author img

By

Published : Oct 3, 2020, 4:48 AM IST

Updated : Oct 3, 2020, 5:40 AM IST

దేశంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఉత్తర్​ప్రదేశ్ హాథ్రస్ ఘటన మరువక ముందే అలాంటి దారుణాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. మధ్యప్రదేశ్​ నర్సింగ్​పుర్ జిల్లా గాడర్వారలో ఐదు రోజుల క్రితం సామూహిక అత్యాచారానికి గురైంది ఓ 32 ఏళ్ల దళిత మహిళ. శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసేందుకు మూడు రోజులు స్టేషన్​ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. స్టేషన్ ఇంఛార్జ్​ని అరెస్టు చేయడం సహా, ఏఎస్పీ, ఎస్డీఓపీలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

మేనకోడిలిపైనే..

ఝార్ఖండ్​ ఖుంతి జిల్లా గుల్లు గ్రామంలో 12 ఏళ్ల మేనకోడలిపైనే అత్యాచాారానికి పాల్పడ్డాడు 32 ఏళ్ల మృగాడు. తన సోదరుడితో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

3ఏళ్ల చిన్నారిపై 11ఏళ్ల బాలుడు..

హిమాచల్ ప్రదేశ్​లో జరిగిన మరో దారుణ ఘటనలో 3 ఏళ్ల చిన్నారిని రేప్​ చేశాడు 11 ఏళ్ల బాలుడు. ఘటన అనంతరం ఏడుస్తూ ఇంటికెళ్లిన చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం తెలిసింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

15 రోజులు

ఉత్తర్​ప్రదేశ్ జౌన్​పుర్​లో జరిగిన మరో ఘటనలో పొరుగింటి మహిళను నిర్బంధించి 15 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 3, 2020, 5:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.